AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani Puja: మహిళలు శనీశ్వరుడు పూజించడానికి నియమాలున్నాయని తెలుసా..! అవి ఏమిటంటే..

హిందూ మతంలో సూర్యుడు ఛాయాదేవిల తనయుడు శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. శనీశ్వరుడిని పూజించేటప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినా శనీశ్వరుడికి చాలా ఆగ్రహం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో మహిళలు శనీశ్వరుడిని పుజించాలాంటే కొన్ని నియమాలున్నాయి. ఈ రోజు ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం..

Lord Shani Puja: మహిళలు శనీశ్వరుడు పూజించడానికి నియమాలున్నాయని తెలుసా..! అవి ఏమిటంటే..
Lord Shani Jayanti
Surya Kala
|

Updated on: Jun 23, 2025 | 3:54 PM

Share

హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. శనీశ్వరుడు మనుషుల కర్మ ఫలాల ఆధారంగా మంచి చెడుల ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడిని దేవుడిని పూజించేటప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలిసి తెలియక చేసిన చిన్న తప్పు కూడా శనీశ్వరుడికి కోపం తెప్పించగలదు. అంతేకాదు స్త్రీల జీవితంలో చెడు ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో మహిళలు శనిశ్వరుడిని పూజించడానికి ఉన్న నియమాలు ఏమిటో తెలుసుకుందాం..

శనీశ్వరుడిని పూజించడానికి నియమాలు

స్త్రీలు శనీశ్వరుడిని పూజించవచ్చు. అయితే కొన్ని పూజానియమాలను గుర్తుంచుకోవడం ముఖ్యం..

పూజించే హక్కు: హిందూ మత విశ్వాసం ప్రకారం స్త్రీలు శనీశ్వరుడిని పూజించడం నిషేధించబడలేదు. అయితే శనీశ్వరుడిని ఆశీర్వాదం పొందడానికి కొన్ని నియమాలను పాటించడం ద్వారా మాత్రమే ఆయనను పూజించవచ్చు.

ఇవి కూడా చదవండి

విగ్రహాన్ని తాక వద్దు: శనీశ్వరుడిని పూజించేటప్పుడు మహిళలు శని దేవుడి విగ్రహాన్ని తాకకుండా జాగ్రత్త వహించాలి. మహిళలు శనీశ్వరుడిని విగ్రహాన్ని తాకడం నిషేధించబడింది.

నూనె సమర్పించవద్దు: స్త్రీలు శనీశ్వరుడి విగ్రహంపై నేరుగా నూనె సమర్పించకూడదు. బదులుగా స్త్రీలు ఒక గిన్నెలో నూనె వేసి దీపం వెలిగించి.. దానిని శనీశ్వరుడికి సమర్పించాలి.

ఆలయంలో పూజలు: ఆలయంలో శని దేవుడిని పూజించేటప్పుడు మహిళలు విగ్రహం ముందుకు రాకూడదు. మహిళలు శని యంత్రం లేదా అతని నీడని మాత్రమే శని దేవుడిగా భావించి మహిళలు పూజించాలి.

ఇంట్లో పూజలు: వీలైతే మహిళలు ఇంట్లో శని దేవుడిని పూజించాలి. అయితే శనీశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచే ముందు.. ఖచ్చితంగా జ్యోతిష్కుడి సలహా తీసుకోవాలి.

శనీశ్వరుడి దృష్టి: శనీశ్వరుడి తిరోగమన దృష్టిని నివారించడానికి.. మహిళలు శనివారం ఆలయానికి వెళ్లే బదులు శనీశ్వరుడికి ఇష్టమైన లేదా శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులను అవసరం అయిన వారికి లేదా పేదవారికి దానం చేయాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..