Bhagavad Gita: కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నప్పుడు అర్జునుడు మాత్రమే కాదు మరికొందరు విన్నారని తెలుసా.. ఎవరంటే..
శ్రీమద్ భగవద్గీత హిందూ ప్రధాన మత గ్రంథం. ఇది మహాభారతంలో ఒక భాగం. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణగా చెప్పబడింది. కృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం గురించి బోధించాడు. అందుకనే ఇది జ్ఞాన భాండాగారం కూడా. అయితే కురుక్షేత్రంలో గీత బోధనలను విన్నది అర్జునుడు ఒక్కడే మాత్రమే కాదని మీకు తెలుసా.

సనాతన ధర్మంలో అష్టాదశ పురాణాలు మాత్రమే కాదు.. లెక్కలేనన్ని పౌరాణిక గ్రంథాలు ఉన్నాయి. అవి సమస్త మానవాళికి జ్ఞాన భాండాగారాలు. వీటిలో ఒకటి భగవద్గీత. ఇది చాలా పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది. ఇది మాత్రమే కాదు శ్రీమద్భగవద్గీత ప్రపంచంలో అత్యధికంగా చదివే మత గ్రంథాలలో ఒకటి. మహాభారత కథ ప్రకారం శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్నప్పుడు, అర్జునుడితో పాటు.. మరో ముగ్గురు కూడా విన్నారని మీకు తెలుసా.. ఆ వ్యక్తులు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం…
హనుమంతుడు
కురుక్షేత్రంలో కృష్ణుడు.. అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్నప్పుడు అర్జునుడితో పాటు.. అక్కడే రథంపై ఉన్న జెండాలో ఉన్న హనుమంతుడు కూడా గీతా ఉపన్యాసం విన్నాడు. మహాభారత కథ ప్రకారం భీముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం.. మహాభారత యుద్ధం సమయంలో పవనపుత్ర హనుమంతుడు అర్జునుడి రథం జెండాలో ఉండి రథాన్ని రక్షించాడు. కనుక గీతోపదేశం జరుగుతున్నప్పుడు హనుమంతుడు కూడా శ్రీమద్ భగవద్గీతను విన్నాడు.
సంజయుడు
ధృతరాష్ట్రుని ఆస్థానంలో సలహాదారు.. ఆయనకు రథసారధి అయిన సంజయుడు కూడా గీతా బోధనను విన్నాడు. సంజయుడు మహర్షి వేద వ్యాసుడి నుంచి దివ్య దృష్టిని వరంగా పొందాడు. ఫలితంగా.. అతను కురుక్షేత్రంలో జరిగిన యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి. అక్కడ జరిగే వృత్తాంతాన్ని ధృతరాష్ట్రుడికి వివరించిన సంజయుడుకి కూడా శ్రీకృష్ణుడు.. అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్నప్పుడు దానిని వినే భాగ్యం పొందాడు. దీనితో పాటు సంజయుడు కృష్ణుడి విశ్వరూపాన్ని కూడా దర్శించుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విధంగానే ఆయన ఈ ఉపదేశాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు
బార్బరిక్
ఘటోత్కచుడు, అహిలావతిల కుమారుడు బార్బరిక్ కూడా ఈ గీతోపదేశాన్ని విన్నాడు. అతను భీముడి మనవడు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు.. బార్బరిక్ కూడా యుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరాడు. శ్రీ కృష్ణుడికి ఈ విషయం తెలిసినప్పుడు.. బార్బరిక్ యుద్దంలో చేరితే.. ఈ యుద్ధానికి ముగింపు ఉండదని కృష్ణుడు అర్థం చేసుకున్నాడు.
ఎందుకంటే బార్బరిక్ ఎప్పుడూ ఓడిపోయే వ్యక్తి లేదా పక్షం వైపు నిలబడతాడు. కనుక బార్బరిక్ ఎవరు బలహీనంగా ఉంటే వారి వైపు పోరాడతాడు. అటువంటి పరిస్థితిలో పాండవులు బలహీనంగా మారినప్పుడు, బార్బరిక్ వారి పక్షాన పోరాడేవాడు. కౌరవులు బలహీనంగా మారినప్పుడు బార్బరిక్ వారి పక్షానికి వెళ్ళేవాడు.
ఈ విషయం శ్రీ కృష్ణుడికి తెలుసు కనుక శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి లీల చేసి బార్బరిక్ తలని ఇవ్వమని దానంగా అడిగాడు. నవ్వుతూ.. బార్బరిక్ తన తలని దానంగా కృష్ణుడికి ఇచ్చేశాడు. అయితే నువ్వు సామాన్యు బ్రాహ్మణుడికి చెప్పాడు. దయచేసి నీ నిజ రూపాన్ని నాకు చూపించమని కృష్ణుడిని బార్బరిక్ అడిగాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు సంతోషించి తన అసలు రూపంలో కనిపించడమే కాదు అదృశ్య రూపంలో ఈ యుద్ధం చూసే వరం కూడా ఇచ్చాడు. అందువల్ల శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్నప్పుడు బార్బరిక్ కూడా దానిని విన్నాడు. తరువాత బార్బరిక్.. ఖతు శ్యామ్ అనే పేరుతో పూజించబడుతున్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








