AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Kidney Cancer Day: నేడు కిడ్నీ క్యాన్సర్ డే.. మూత్రపిండాలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు ఇవే.. క్యాన్సర్ నుంచి రక్షణ

ప్రతి సంవత్సరం జూన్ మూడవ గురువారం రోజుని ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ తీవ్రమైన వ్యాధి గురించి ప్రజలలో అవగాహన పెంచడం ఈ కిడ్నీ క్యాన్సర్ డే ఉద్దేశ్యం. కిడ్నీ క్యాన్సర్ ని మూత్రపిండ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది మూత్రపిండ కణాల అనియంత్రిత పెరుగుదల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి.

World Kidney Cancer Day: నేడు కిడ్నీ క్యాన్సర్ డే.. మూత్రపిండాలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు ఇవే.. క్యాన్సర్ నుంచి రక్షణ
World Kidney Cancer Day
Surya Kala
|

Updated on: Jun 19, 2025 | 10:05 AM

Share

రోజు రోజుకీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఏడాది ఏడాదికి మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు అత్యంత ప్రమాదకకరం. అటువంటి క్యాన్సర్ లో ఒకటి కిడ్నీ క్యాన్సర్. మనిషి శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. వీటి ప్రధాన విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం. అయితే కొన్నిసార్లు కిడ్నీల లోపల మాస్ (పెరుగుదల లేదా కణితులు) అభివృద్ధి చెందుతాయి. ఈ ఎదుగుదలలలో కొన్ని క్యాన్సర్‌ కణితులుగా మారతాయి.

ఈ నేపధ్యంలో ప్రతి సంవత్సరం జూన్ మూడవ గురువారం రోజున ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ డేగా జరుపుకుంటారు. ఈ తీవ్రమైన వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. కిడ్నీ క్యాన్సర్‌ను రీనల్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది మూత్రపిండాలలో సంభవించే ప్రాణాంతక వ్యాధి. కిడ్నీ కణాలు అనియంత్రితంగా పెరగడం ప్రారంభించినప్పుడు ఈ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. ఈ కణాలు క్రమంగా కణితులుగా మారుతాయి.

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. జీవనశైలిలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో తినే ఆహారం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు మూత్రపిండాలకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల గురించి తెలుసుకుందాం. అదే సమయంలో ఈ తీవ్రమైన వ్యాధి లక్షణాల గురించి కూడా తెలుసుకుందాం. తద్వారా ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు

  1. మూత్రంతో పాటు రక్తస్రావం.
  2. మూత్రం రంగు గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది.
  3. నిరంతర నడుము నొప్పి.
  4. ఆకస్మికంగా బరువు తగ్గడం.
  5. ఆకలి లేకపోవడం.
  6. ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం
  7. తరచుగా జ్వరం వస్తూ ఉండడం
  8. రక్తం లేకపోవడం.
  9. రాత్రి సమయంలో కూడా ఆధికంగా చెమటలు పడుతుంటే
  10. తినాల్సిన ఆహార పదార్ధాలు

బెర్రీలు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటాయి . నిజానికి వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మూత్రపిండాలను వాపు , ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.

క్యాప్సికమ్ భారతీయ వంట ఇంట్లో ఉండే కూరగాయ. ఇది అంటే చాలామందికి ఇష్టం. ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ , సి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తాయి. దీనిలో సోడియం పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా, ఇది మూత్రపిండాలకు దివ్యౌషధం కంటే తక్కువ కాదు.

చేపలు మన మూత్రపిండాలకు ఒక వరం అని చేపవచ్చు. సాల్మన్, మాకేరెల్ , ట్యూనా వంటి చేపలలో మంచి మొత్తంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కనిపిస్తాయి. అయితే చేపలలో ఎక్కువ ప్రోటీన్ ఉన్నందున వాటిని పరిమిత పరిమాణంలో తినాలి.

గుడ్డులోని తెల్లసొన: మాంసాహారులైతే తినే ఆహారంలో గుడ్డులోని తెల్లసొనను చేర్చుకోవాలి. ఇది మూత్రపిండాలకు ఆరోగ్యకరమైన ఎంపిక.

ఎర్ర ద్రాక్షలు రుచితో నిండి ఉండటమే కాదు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. వీటిల్లో మంచి మొత్తంలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. అవి మంటను తగ్గించగలవు. దీని కారణంగా మూత్రపిండాల సమస్యలను నివారిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)