- Telugu News Photo Gallery Do you have oily skin? Don't worry, these tips will help you avoid the problem.
Oily Skin Tips: చర్మం జిడ్డుగా ఉందా.? చింత వద్దు.. ఈ చిట్కాలతో సమస్య దూరం..
వర్షాకాలంలో ఆయిల్ స్కిన్‌తో బాధపడేవారు, మొటిమల సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక గంట పాటు బయటకు వెళ్లినా చర్మం వెంటనే జిడ్డుగా మారి, నల్లగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది ఈ కాలంలో మాయిశ్చరైజర్‌ని ఉపయోగించరు. జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడకపోవడం మంచిదని అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. నిజానికి.. అన్ని చర్మ రకాల వారికీ మాయిశ్చరైజర్ అవసరం. చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా టోనర్, మాయిశ్చరైజర్ వాడాలి. సరైన మాయిశ్చరైజర్‌ని ఎంచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఎలాంటి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలంటే..
Updated on: Jun 19, 2025 | 7:29 PM

జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడకపోవడం మంచిదని అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. నిజానికి.. అన్ని చర్మ రకాల వారికీ మాయిశ్చరైజర్ అవసరం. చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా టోనర్, మాయిశ్చరైజర్ వాడాలి. ఎందుకంటే స్కిన్ హైడ్రేషన్‌గా ఉండాలంటే మాయిశ్చరైజర్ చాలా అవసరం.

అయితే మాయిశ్చరైజర్స్ వాడితే ముఖం మరింత జిడ్డుగా తయారవుతుందని అనుకుంటారు. సరైన మాయిశ్చరైజర్‌ని ఎంచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఎలాంటి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలంటే..

నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది మీ చర్మాన్ని జిడ్డుగా మార్చదు. చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా ఉంచుతుంది. ఎన్నో ఫేమస్ బ్రాండ్లకు సంబంధించిన నూనె లేని మాయిశ్చరైజర్లు ప్రస్తుతం మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మం అదనపు నూనెను గ్రహించేలా చేస్తాయి. ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మొటిమలను కూడా అదుపులో ఉంచుతుంది.

అదేవిధంగా.. లాక్టిక్ ఆమ్లం/ గ్లైకోలిక్ ఆమ్లం జిడ్డు చర్మానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. వాస్తవానికివి నీటి ఆధారిత ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు. ఇవి తేమను నిలుపుకోవటానికి, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడతాయి. మీరు ఇలాంటి వాటిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.

జిడ్డు చర్మంతో బాధపడేవారు విటమిన్ సి సీరమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అలాగే ఇది మొటిమల సమస్యలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. విటమిన్ సి సీరమ్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.




