- Telugu News Photo Gallery Spinach is very good for health but people with these problems should not eat it in telugu
Palakura: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది.. కానీ, ఇలాంటి వారికి వెరీ డేంజర్..!
పండ్లు, కూరగాయలతో పాటు ఆకు కూరలు కూడా సంపూర్ణ ఆరోగ్యానికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం. అయితే, ఆకుకూరల్లో ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఆకు కూరల్లో ముఖ్యంగా పాలకూర పోషకాల గని. అందుకే, వైద్యులు సైతం తరచూ పాలకూర తినమని సలహా ఇస్తుంటారు. అలాగే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం పాలకూరను పొరపాటున కూడా తినకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు పాలకూర తినకూడదో తెలుసుకోండి.
Updated on: Jun 19, 2025 | 7:06 PM

Spinach

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు పాలకూరకు దూరంగా ఉండాలి. అలాగే, ఫుడ్ అలర్జీలు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కూడా పాలకూరను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కూడా పాలకూర తినకూడదని అంటున్నారు.

పాలకూరలో ఉండే ప్యూరిన్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటే కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలకూర తినకూడదు.

రక్తం పలుచబడేందుకు మందులు వాడుతున్న వారు పొరపాటున కూడా పాలకూరను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. పాలకూరలో ఉండే విటమిన్ కె రక్తం పలుచన చేసే మందులతో కలిసి ప్రతిస్పందిస్తుంది. ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి మందులు వాడే వారు మర్చిపోయి కూడా పాలకూరను తినకూడదని అంటున్నారు.

కొంతమందికి పాలకూర తినడం వల్ల అలెర్జీ ఉండవచ్చు. ఉడికించిన లేదా పచ్చి పాలకూర ఆకులను తినడం వల్ల అలెర్జీలు వస్తాయి. అలాగే, పాలకూర, కాలే వంటి ఆకుపచ్చ కూరగాయలలో కాల్షియం ఉంటుంది, కానీ వాటిలో ఉండే ఆక్సలేట్లు కాల్షియాన్ని బంధిస్తాయి. శరీరంలో కాల్షియం శోషణను నిరోధిస్తాయి. కాల్షియం లోపం ఉన్నవారు పాలకూర, కాలే వంటి ఆకుకూరలు తినకూడదు.




