- Telugu News Photo Gallery Business photos Top gold etfs highest 3 year returns 2025 gold etf investment benefits details in telugu
Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్‌లతో గోల్డెన్ ఛాన్స్.. అదిరే రాబడినిచ్చిన టాప్-5 బెస్ట్ ఈటీఎఫ్‌లు ఇవే..!
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్ని ఉత్తమ ఎంపికలలో ఒకటిగా పెట్టుబడిదారులు పరిగణిస్తున్నారు. కానీ చాలా మంది బంగారాన్ని భౌతిక రూపంలో ఉంటే దొంగల భయం వల్ల భౌతిక రూపంలో ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా మారాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు పెట్టుబడిదారులకు రెండు ప్రధాన సౌకర్యాలను అందిస్తున్నాయి. ఈ ఈటీఎఫ్‌లు చాలా అధిక స్వచ్ఛతతో ఉన్న బంగారం ధరతో సమానంగా ఉంటాయి. అంతేకాకుండా పెట్టుబడిదారుడు తయారీ ఛార్జీల కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు మంచి రాబడినిచ్చిన గోల్డ్ ఈటీఎఫ్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Jun 19, 2025 | 3:53 PM


యూటీఐ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ మూడు సంవత్సరాల కాల వ్యవధిలో 23.14 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. దీని ఏయూఎం రూ. 1,983 కోట్లు కాగా మే 9, 2025 నాటికి దాని ఎన్ఏవీ రూ.82.5825గా ఉంది. బంగారం దేశీయ ధరతో పోలిస్తే ఈ ఫండ్ మార్చి 2007లో ప్రారంభమైనప్పటి నుంచి 12.65 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది.

ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ 3 సంవత్సరాలలో 22.84 శాతం వార్షిక రాబడిని అందించింది. దీని ఆస్తి బేస్ రూ. 277 కోట్లు కాగా, మే 9, 2025 నాటికి దాని యూనిట్ ధర రూ. 8,528.7274గా ఉంది. దేశీయ బంగారం ధరతో పోలిస్తే ఈ ఫండ్ మార్చి 2010లో ప్రారంభించినప్పటి నుండి 11.24 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది.

క్వాంటం గోల్డ్ సేవింగ్స్ ఫండ్ మూడు సంవత్సరాల కాల వ్యవధిలో గోల్డ్ ఇటిఎఫ్ 22.69 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. దీని ఏయూఎం రూ. 192 కోట్లుగా ఉంటే మే 9, 2025 నాటికి దాని ఎన్ఏవీ రూ. 37.5149గా ఉంది. బంగారం దేశీయ ధరతో పోలిస్తే ఈ ఫండ్ మే 2011లో ప్రారంభమైనప్పటి నుంచి 9.86 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది.

హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ మూడు సంవత్సరాలలో 22.65 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. దీని నిధి పరిమాణం రూ. 3,871 కోట్లు కాగా, మే 9, 2025 నాటికి దాని యూనిట్ ధర రూ. 30.6635గా ఉంది. దేశీయ బంగారం ధరతో పోలిస్తే ఈ ఫండ్ జనవరి 2013లో ప్రారంభమైనప్పటి నుండి 8.55 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది.




