AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Dosha Remedies: జాతకంలో రాహు స్థానం బలహీనమా..! దోష నివారణకు ఏమి చేయాలంటే..

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా రాహు దోషం ఉంటే.. అది మీకు చెడు ప్రభావాలను ఇస్తుంది. ఈ రాహు దోషం కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు జాతకంలో ఉన్న రాహు దోషం నుంచి వదిలించుకోవాలనుకుంటే.. రాహువును వెంటనే శాంతింపజేయడానికి.. రాహు అనుగ్రహం పొందడానికి కొన్ని పరిష్కారాలున్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Rahu Dosha Remedies: జాతకంలో రాహు స్థానం బలహీనమా..! దోష నివారణకు ఏమి చేయాలంటే..
Mesha Rashi Rahuvu
Surya Kala
|

Updated on: Jun 19, 2025 | 7:35 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో రాహు దోషం కారణంగా ఒక వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జాతకంలో రాహువు చెడు స్థానంలో ఉన్న కారణంగా.. మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టం, తన గురించి ఇతరులు అపార్థం చేసుకోవడం, పరస్పర సమన్వయం లేకపోవడం, చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం, దుర్భాషలాడడం, చేతి గోళ్లు స్వయంచాలకంగా విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో ఎవరి జాతకంలోనైనా రాహువు స్థానాన్ని కూడా సరిదిద్దాలనుకుంటే.. రాహువును శాంతింపజేయడానికి పరిష్కారాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

రాహువు దోష నివారణకు ఏమి చేయాలంటే

  1. జాతకంలో రాహువు దోషాన్ని సరిచేయడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక పరిహారాలు సూచించబడ్డాయి. ఈ పరిహారాలు చేయడం ద్వారా రాహువు అశుభ ప్రభావాలు తొలగిపోతాయి. రాహువు స్థానం కూడా బలంగా మారుతుంది.
  2. రాహు మంత్ర జపం: రాహు దోషాన్ని తొలగించడానికి, ‘ఓం రం రాహవే నమః’ అనే మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించండి. ఈ మంత్రం రాహు శాంతికి చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.
  3. రాహు వ్రతం: రాహువు శుభప్రదంగా ఉండాలంటే.. కనీసం 18 శనివారాలు రాహు వ్రతం ఆచరించండి. రాహు దోషాన్ని వదిలించుకోవడానికి సులభమైన మార్గం రాహు వ్రతం ఆచరించడమే.
  4. శివుని ఆరాధన: హిందూ మతంలో రాహువును శివుని భక్తుడిగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ భోలాశంకరుడిని పూజించి ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపించండి.
  5. ఇవి కూడా చదవండి
  6. దుర్గా చాలీసా పారాయణం: జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతిరోజూ దుర్గా చాలీసా పారాయణం చేయడం వల్ల రాహువు అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. రాహువు శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.
  7. నల్ల కుక్కకు ఆహారాన్ని అందించండి: బుధవారం నుంచి ఏడు రోజుల పాటు నల్ల కుక్కకు తీపి ఆహరాన్ని తినడానికి అందించండి. ఈ పరిహారం రాహు దోషాన్ని తగ్గిస్తుంది.
  8. ఒనిక్స్ రత్నం ధరించండి: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒనిక్స్ రత్నం రాహువు కి చెందిన శుభ రత్నం. దీనిని శనివారం మధ్య వేలుకు ధరించాలి.
  9. కొబ్బరికాయను నదిలో విడిచి పెట్టడం: శనివారం రోజున కొబ్బరికాయను నల్లటి వస్త్రంలో కట్టి ప్రవహించే నీటిలో విడిచి పెట్టడం వలన రాహువు శాంతిస్తాడని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..