- Telugu News Photo Gallery Spiritual photos Thursday Fast Benefits for Girls: Seeking Marriage and Happiness
Thursday Puja Tips: మంచి జీవిత భాగస్వామి కోసం అమ్మాయిలు గురువారం ఎలా పూజించాలంటే..
గురువారం శ్రీ మహా విష్ణువు, దేవతల గురువు, నవ గ్రహాల్లోని బృహస్పతి దేవుడికి అంకితం చేయబడింది. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు ఈ రోజున ఉపవాసం ఉండి మంచి జీవిత భాగస్వామిని కోరుకుంటారు. సనాతన ధర్మంలో గురువారం ఉపవాసం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గురువారం ఉపవాసం ఉండటం వల్ల పెళ్ళికాని యువతులు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో తెలుసుకుందాం.
Updated on: Jun 19, 2025 | 6:42 AM

జ్యోతిషశాస్త్రంలో దేవ గురువు బృహస్పతిని పూజించేందుకు చాలా శుభప్రదమైన రోజుగా భావిస్తారు. నవ గ్రహాల్లో ఒకటైన గురువు వివాహం, పిల్లలు, సంపద, జ్ఞానానికి ఒక కారకుడు. దీంతో గురువారం ఉపవాసం చేయడం వల్ల బృహస్పతి బలపడుతుంది. అపుడు ఈ రంగాలలో సానుకూల ఫలితాలను ఇస్తుంది.

గురువారం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుని, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా.. శ్రీ మహా విష్ణువు సంతోషించి భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.

వివాహానికి బృహస్పతిని ప్రధాన కారకుడిగా భావిస్తారు. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్న లేదా వివాహంలో అడ్డంకులు ఎదుర్కొనే అమ్మాయిలు.. గురువారం ఉపవాసం ఉండటం వల్ల ఈ అడ్డంకులు తొలగిపోయి.. చిన్న వయసులోనే వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది.

వైవాహిక జీవితానికి బృహస్పతి కూడా ఒక కారకుడు. వివాహిత స్త్రీలు తమ భర్తల ఆరోగ్యం, దీర్ఘాయువు, తమ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని కోరుకుంటూ ఈ ఉపవాసం ఆచరిస్తారు.

దంపతులకు.. సంతానాన్ని బృహస్పతి కూడా ఒక కారకుడు. పిల్లలు పుట్టడంలో ఇబ్బంది ఉన్న జంటలు గురు వారం రోజున ఉపవాసం ఆచరిస్తారు. తమకు పిల్లలు పుట్టే ఆనందం కోసం బృహస్పతిని ప్రార్థిస్తారు. పూజిస్తారు.

సంతాన ధర్మంలోని విశ్వాసాల ప్రకారం.. ఉపవాసం, ఆరాధన ఒక వ్యక్తికి మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది. ఈ రోజు చేసే ఉపవాసం ప్రతికూల శక్తిని తొలగించి సానుకూలతను తెస్తుంది.

శ్రీ మహా విష్ణువు , లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల.. గురువారం పూజించి ఉపవాసం పాటించే వ్యక్తికి సంపద,శ్రేయస్సు లభిస్తుంది. ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.




