Holy Basil: ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉండటం ఎందుకు శుభప్రదంగా భావిస్తారో తెలుసా?
హిందూ సంస్కృతిలో తులసి మొక్కను పవిత్రంగా, శుభప్రదంగా భావిస్తారు. జోతిష్య, వాయుశాస్త్రంలో తులసి మొక్కను విష్ణువు లేదా లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. ఇంట్లో తులసి ఉంటే దైవిక శక్తి, సానుకూల శక్తి నిలుస్తుందని హిందువుల నమ్మకం. తులసి మొక్క ఇంటి ఆవరణలో, ముఖ్యంగా ఈశాన్య దిశలో ఉంచితే, నెగెటివ్ ఎనర్జీని తొలగించి, శాంతి, ఐశ్వర్యం తెస్తుందని చెబుతారు. తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇది గాలిని శుద్ధి చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని సుగంధం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే, హిందువులు తమ ప్రాంగణంలో తులసి మొక్కలను ఎంతో భక్తితో నాటుతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




