Rahu’s Influence: జాతకంలో ఈ గ్రహం బలహీనంగా ఉందా.. జాగ్రత్త సుమా.. చెడు అలవాట్లకు ఆకర్షితులయ్యే అవకాశం..
జ్యోతిషశాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలు మనిషి జీవితాలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. జాతకంలో ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు.. దాని ప్రతికూల ప్రభావం వ్యక్తి జీవితంలోని వివిధ అంశాలపై కనిపిస్తుంది. అయితే ఛాయా గ్రహం అయిన రాహు గ్రహం జాతకంలో బలహీనంగా ఉండటం వల్ల వ్యక్తి జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ గ్రహాలు జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నమ్మకం. ఈ గ్రహాల స్థానం, బలం ఒక వ్యక్తి స్వభావం, అలవాట్లు, భవిష్యత్తు దిశను నిర్ణయిస్తాయి. ఈ గ్రహాలలో రాహువు ఒక మర్మమైన నీడ గ్రహం. ఎవరి జాతకంలోనైనా రాహువు బలహీనంగా లేదా అశుభంగా ఉన్నప్పుడు.. అతని జీవితంలో ప్రతికూల మార్పులు రావడం. అంతేకాదు ఆ వ్యక్తి క్రమంగా చెడు అలవాట్ల వైపు ఆకర్షితులవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే తొమ్మిది గ్రహాలలో రాహువు పాప గ్రహంగా పరిగణించబడుతుంది. కనుక రాహు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అనేక చెడు అలవాట్ల వైపు నెట్టివేస్తుంది.
రాహువుకి చెడు అలవాట్లకి సంబంధం ఏమిటి?
రాహువును మాయావి గ్రహం అని కూడా పిలుస్తారు. ఇది భ్రమ, అనుబంధం, మోసానికి కారణం. ఎవరి జాతకంలోనైనా రాహువు బలహీనంగా లేదా అశుభంగా ఉన్నప్పుడు.. అతనిలో ప్రతికూల ధోరణులు పెరగడం ప్రారంభమవుతుంది. అటువంటి వ్యక్తి జీవితం అనేక సమస్యలు కలుగుతాయి. అతను చెడు అలవాట్లకు బానిసగా మారతాడని శాస్త్రాలలో వివరించబడింది.
రాహువు బలహీనపడటం వల్ల కలిగే సంకేతాలు , ప్రభావాలు
కఠినమైన ప్రసంగం,అబద్ధం: రాహు స్థానం బలహీనంగా ఉంటే అటువంటి వ్యక్తి మాటలు కఠినంగా ఉంటాయి. తరచుగా అబద్ధం చెప్పడం ప్రారంభిస్తారు. సత్యాన్ని దాచిపెట్టడం, విషయాలను వక్రీకరించిన రీతిలో మాట్లాడడం వీరికి అలవాటుగా మారుతుంది.
జూదం, పందాలు: రాహువు ప్రభావం ఒక వ్యక్తిని జూదం, పందాలు వంటి వాటి వైపు ఆకర్షిస్తుంది. డబ్బు సంపాదించాలనే కోరికతో వారు తప్పుడు పద్ధతులను ఆశ్రయించడం ప్రారంభిస్తారు.
మితిమీరిన దురాశ, నిజాయితీ లేకపోవడం: బలహీనమైన రాహువు.. ఆ వ్యక్తిలో మితిమీరిన దురాశను సృష్టిస్తాడు. దీని కారణంగా వీరు ఇతరుల హక్కులను లాక్కోవడానికి లేదా చెడు పనులు చేయడానికి కూడా వెనుకాడరు. దొంగతనం, మోసం వంటి ధోరణులు కూడా పెరుగుతాయి.
చెడు సహవాసం, వ్యసనం: రాహువు బలహీనంగా ఉన్న వ్యక్తులు తప్పుడు వ్యక్తుల సహవాసానికి అలవాటు అవుతారు. అంతేకాదు మద్యం, సిగరెట్లు లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించడం ప్రారంభించవచ్చు. ఈ సహవాసంతో మరింత తప్పుడు మార్గాల్లో పయనించేలా చేస్తుంది.
కోపం, తగాదాలు: రాహువు బలహీనంగా ఉన్న వ్యక్తికి చాలా కోపంగా ఉంటాడు. చిన్న చిన్న విషయాలకే కోపం వ్యక్తం చేస్తాడు. అంతేకాదు చిన్న విషయాలకు కూడా గొడవ పడటం ప్రారంభిస్తారు. ఇది వారి సంబంధాలలో వివాదాలను కలిగిస్తుంది.
కుతంత్రం, మోసం: ఇలాంటి వ్యక్తులు చాలా తెలివైనవారు. కుతంత్రపరులు అవుతారు. వారు తమ సొంతం లాభం కోసం ఇతరులను ఉపయోగించుకోవడానికి వెనుకాడరు.
చర్మ వ్యాధులు: జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు చర్మ వ్యాధులకు కూడా ఒక కారణం. జాతకంలో రాహువు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి చర్మ సమస్యలతో ఇబ్బంది పడతారు.
మానసిక అశాంతి, గందరగోళం: బలహీనమైన రాహువు ఒక వ్యక్తిని మానసికంగా కలవరపెడుతుంది. మనస్సులో ఎల్లప్పుడూ ఏదో గందరగోళం లేదా భయం ఉంటుంది.
రాహువు ప్రతికూల ప్రభావాలను ఎలా శాంతపరచాలంటే
- రాహు మంత్రాలను జపించడం: “ఓం రాం రాహవే నమః” మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల రాహువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- పేదలకు, ఆపన్నులకు దానం చేయడం: రాహు అనుగ్రహం కోసం మినపప్పు, ఆవ నూనె, దుప్పట్లు మొదలైనవి దానం చేయవచ్చు. శనివారాల్లో ఈ పరిహారం చేయడం శుభప్రదంగా పరిగణింపబడుతున్నది. రాహు దోషాన్ని కూడా తొలగిస్తుంది.
- మహాదేవుని ఆరాధన: రాహువు ప్రతికూల ప్రభావాలను శాంతపరచడంలో శివుడిని పూజించడం, ఆయనను పూజించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
- హనుమంతుడిని పూజించండి : మంగళవారం, శనివారం బజరంగబలిని పూజించడం వల్ల రాహువు ప్రభావం తగ్గుతుంది.
- కొబ్బరికాయ, నీలిరంగు వస్త్రాన్ని దానం చేయండి: శనివారం రాహు శాంతి కోసం కొబ్బరికాయ, నీలిరంగు వస్త్రాలను దానం చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.