AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: జాతకంలో గ్రహ స్థానం బలహీనంగా ఉందా.. ఏ గ్రహానికి ఏ రత్నం ధరించాలంటే..

జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో గ్రహాల స్థానం బలహీనంగా ఉంటే అనేక సమస్యలు కలుగుతాయి. దీంతో కొన్ని నివారణ చర్యలు చేపడతారు. అయితే గ్రహాల స్థానం మెరుగుపరిచేందుకు 9 రత్నాల గురించి ప్రస్తావించబడింది. ఈ రత్నాలను ఉపయోగించడం వల్ల జాతకంలో నవగ్రహాల స్థానం బలపడుతుంది. ఈ రోజు జాతకం ప్రకారం ఏ గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఏ రత్నాన్ని ధరించాలో తెలుసుకుందాం.

Astrology: జాతకంలో గ్రహ స్థానం బలహీనంగా ఉందా.. ఏ గ్రహానికి ఏ రత్నం ధరించాలంటే..
Gemstones In Astrology
Surya Kala
|

Updated on: Jul 06, 2025 | 8:11 AM

Share

జ్యోతిషశాస్త్రంలో రత్నాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. జాతకంలో గ్రహాల స్థానాన్ని చూసి ఏ రత్నాన్ని ధరించాలో జ్యోతిష్కులు చెబుతారు. ప్రతి రత్నానికి దాని సొంత ప్రాముఖ్యత, పని తీరు ఉంటుంది. రత్నాల శాస్త్రంలో తొమ్మిది గ్రహాలకు గాను 9 రత్నాల గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ రత్నాలను ఉపయోగించడం వల్ల జాతకంలో తొమ్మిది గ్రహాల స్థానం బలపడుతుంది. అలాగే ఏ గ్రహానికి ఏ రత్నాన్ని ధరించాలో జ్యోతిషశాస్త్రంలో కూడా ప్రస్తావించబడింది. ఏ గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఏ రత్నాన్ని ధరించాలో తెలుసుకుందాం.

  1. సూర్య గ్రహం: జ్యోతిషశాస్త్రం ప్రకారం రూబీ సూర్యుని రత్నం. దీనిని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు .
  2. చంద్ర గ్రహం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యం రత్నం చంద్రుని రత్నం. దీనిని ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, భావోద్వేగ స్థిరత్వం వస్తుందని నమ్ముతారు.
  3. అంగారక గ్రహం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పగడపు రత్నం అంగారక గ్రహానికి చెందిన రత్నం. దీనిని ధరించడం వల్ల ధైర్యం, శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పరమైన నమ్మకం ఉంది.
  4. బుధ గ్రహం: పచ్చ అనేది బుధ రత్నం. రత్నాల శాస్త్రం ప్రకారం దీనిని ధరించడం వల్ల తెలివితేటలు , వాక్చాతుర్యం మెరుగుపడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. బృహస్పతి రత్నం: రత్నశాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహానికి సంబంధించిన రత్నం పసుపు నీలమణి. దీనిని పుష్యరాగం లేదా పుఖ్రాజ్ అని కూడా పిలుస్తారు. దీనిని ధరించడం వల్ల జ్ఞానం, శ్రేయస్సు పెరుగుతుందని చెబుతారు .
  7. శుక్ర గ్రహం రత్నం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వజ్రం శుక్రుని రత్నం. దీనిని ధరించడం వల్ల ఆనందం, శ్రేయస్సు, ప్రేమ పెరుగుతాయని నమ్ముతారు.
  8. శని గ్రహం రత్నం: జ్యోతిషశాస్త్రం ప్రకారం నీలి నీలం శనీస్వరుడి గ్రహానికి చెందిన రత్నం. దీనిని ధరించడం వల్ల శని గ్రహం అశుభ ప్రభావాలు తగ్గుతాయి. క్రమశిక్షణ పెరుగుతుంది.
  9. రాహు గ్రహం రత్నం: జ్యోతిషశాస్త్రం ప్రకారం గోమేధ రత్నం రాహువు రత్నం. దీనిని ధరించడం వల్ల రాహువు వలన కలిగే అశుభ ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు.
  10. కేతు గ్రహం రత్నం: జ్యోతిషశాస్త్రం ప్రకారం వైడూర్యము కేతువు రత్నం. దీనిని ధరించడం వల్ల కేతువు అశుభ ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు