Term Insurance: టర్మ్ ఇన్యూరెన్స్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు..
కరోనా తర్వాత ఆరోగ్యం, కుటుంబ ఆర్ధిక భద్రత గురించి చాలామంది ఆలోచించడం మొదలుపెడుతున్నారు. దీంతో కొత్తగా హెల్త్, లైఫ్ ఇన్యూరెన్స్ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే వీటిల్లో టర్మ్ ఇన్యూరెన్స్ తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపరు. కానీ టర్మ్ ఇన్యూరెన్స్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

టర్మ్ ఇన్యూరెన్స్ తీసుకోవడానికి చాలామంది వెనకాడుతుంటారు. ప్రీమియం చెల్లించే డబ్బులు తిరిగి రావని అనుకుంటుంటారు. అందుకే ఈ ఇన్యూరెన్స్‌లు తీసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపించరు. కానీ అది ఒక అపోహ మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో ప్రీమియం తిరిగి వచ్చే పాలసీలు చాలానే ఉన్నాయి. టర్మ్ ఇన్యూనెన్స్ అనేది మన ఫ్యామిలీకి మనం కల్పించే ఆర్ధిక భద్రత. ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీకి అర్ధికంగా అండగా ఉంటుంది. తక్కువ ప్రీమియంలో ఎక్కువ రిటర్మ్స్ పొందే అవకాశం టర్మ్ ఇన్యూరెన్స్‌లో ఉంటుంది. టర్మ్ ఇన్యూరెన్స్ ఎందుకు తీసుకోవాలి..? లాభనష్టాలేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టర్మ్ ఇన్యూరెన్స్ అంటే..?
టర్మ్ ఇన్యూరెన్స్ అంటే మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీకి రక్షణ కల్పించేది. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారులు మరణిస్తే నామినీకి పెద్ద మొత్తంలో డబ్బులు అందుతాయి. కేవలం అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రిటర్మ్స్ ఇందులో వస్తాయి. నెలకు వెయ్యి చెల్లించి కోటి వరకు బీమా పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో మీరు చెల్లించిన ప్రీమియం తిరిగి వచ్చే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లు తీసుకుంటే మీ పాలసీ టెన్యూర్ ముగిశాక మీ డబ్బులు తిరిగి పొందోచ్చన్నమాట
ఎందుకు తీసుకోవాలి..?
మీకు ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగి మరణిస్తే పిల్లల చదువులు, పెళ్లిళ్లకు సహాయపడుతుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ సెక్షన్ 80సీ క్రింద ప్రీమియంపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుతుంది. ఇక మీరు బ్యాంకుల్లో ఏమైనా అప్పులు చేసి ఉంటే.. మీరు లేనప్పుడు మీ కుటంబంపై భారం పడదు.
