ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి.. పాకిస్తానీల వింత డిమాండ్ వీడియో
ఇండియన్ సినిమాలకు తెగ అలవాటు పడిన పాకిస్తానీలు.. ఈమధ్య మన సినిమాలను ఓపెన్‌గా చూస్తున్న వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలా మన ధురంధర్ మూవీని కూడా ఓపెన్ మార్కెట్లో చూస్తున్న కొందరు పాకిస్తానీలు... మన మేకర్స్‌కో వింత డిమాండ్ చేశారు. ధురుంధర్ కలెక్షన్స్‌లో మాకూ షేర్ కావాలంటూ.. ఓ వీడియోలో చెప్పారు. ఆ వీడియోతో మరో సారి హాట్ టాపిక్ అవుతున్నారు పాకిస్తానీలు.
ఇక అసలు విషయంలోని వెళితే.. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన ‘ధురంధర్’ మూవీని పాకిస్థాన్ కరాచీలోని ‘లయరీ’ అనే ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. 1990ల్లో అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్‌కి ఓ కల్పిత కథ జోడించి దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీ తెరకెక్కించాడు. అయితే ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఈ సినిమా కలెక్షన్స్‌లలో.. తమకు షేర్ ఇవ్వాలని ఇప్పుడు లయరీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో లయరీకి చెందిన పలువురు వ్యక్తులు మాట్లాడారు. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించారు కాబట్టి వసూళ్లలో ఎందుకు వాటా ఇవ్వకూడదు? అని అన్నాడు. మరో వ్యక్తి అయితే ఏకంగా 80 శాతం కలెక్షన్స్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తం ఇవ్వడం వల్ల దర్శకుడికి పెద్దగా పోయేదేం ఉండదని, తర్వాత కూడా ఎలానూ సినిమాలు చేస్తాడు కదా అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే
