Telangana: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కట్ చేస్తే.. గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి.!
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ముకు చెందిన పులికంటి శ్రీను అదే గ్రామానికి చెందిన యువతి కలిసి చదువుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. శ్రీనుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రియుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ప్రియురాలు ఎంతో సంతోషపడింది. తమ పెళ్లి చేసుకుని హాయిగా ఉండవచ్చని భావించింది.

ఆ ఇద్దరిది ఒకటే గ్రామం. ఒకే సామాజిక వర్గం కావడంతో కలిసి చదువుకున్నారు. మాటలు- మనసులు కలిసాయి. దీంతో రెండేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలదొక్కుకోవాలనుకున్నారు. ఇద్దరిలో ఎవరికైనా ప్రభుత్వ కొలువు వస్తే పెళ్లి చేసుకుందామని ఒప్పందం చేసుకున్నారు. తీరా అతడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ముకు చెందిన పులికంటి శ్రీను అదే గ్రామానికి చెందిన యువతి కలిసి చదువుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. శ్రీనుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రియుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ప్రియురాలు ఎంతో సంతోషపడింది. తమ పెళ్లి చేసుకుని హాయిగా ఉండవచ్చని భావించింది. కానీ శ్రీనివాస్ మాత్రం ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. తనను కాకుండా వేరే యువతీని పెళ్లి చేసుకుంటే.. కట్నం వస్తుందని పెళ్లికి నిరాకరించాడని యువతి ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి పోలీసులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ప్రేమించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట రెండు రోజులుగా పెట్రోల్ సీసాతో నిరసన వ్యక్తం చేస్తోంది.
ప్రియుడు పులికంటి శ్రీనివాస్ పరారీలో ఉండగా, తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలం వద్ద ఉన్న గుడిసెలో ఉంటున్నారు. రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రియుడు బంధువులు పట్టించుకోవడం లేదని యువతి బంధువులు ఆగ్రహంతో ఉన్నారు. వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ప్రియుడు తల్లిదండ్రులపై దాడి చేశారు. దీంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు కాశయ్య, భాగ్యమ్మ లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని గాయపడిన బాధితులను దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న యువతి నుండి ఫిర్యాదు తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.
