- Telugu News Photo Gallery Spiritual photos Worship Sai Baba on Guru Purnima, how to do it for auspicious result
Guru Purnima: గురు పౌర్ణమి వేళ సాయి బాబాకి పూజ.. ఎలా చేస్తే శుభ ఫలితాలు..
గురుపూర్ణిమ ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుకునే పండుగ. ఇది జ్ఞానం, గురువులకు గౌరవం, ఆధ్యాత్మిక పురోగతికి ప్రతీక. వ్యాసమహర్షి జయంతిగా కూడా పేరొందిన ఈ పండుగ, గురువులను స్మరించుకోవడం, వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసం జరుపుకుంటారు. గురుపూర్ణిమ రోజు చాలామంది సాయిబాబాను గురువుగా భావించి పూజలు చేసి ఉపవాసం ఉండాలనుకుంటారు. అయితే ఈ పర్వదినాన బాబాకి పూజ ఎలా చెయ్యాలి.? దీని గురించి ఈరోజు వివరం తెలుసుకుందాం..
Updated on: Jul 06, 2025 | 12:52 PM

పూజ ప్రారంభం: తెల్లవారుజామున లేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రపరచుకోవడంతో పూజ ప్రారంభమవుతుంది. పూజామందిరం లేదా విడిగా ఏర్పాటు చేసుకున్న పీటను పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అలంకరించాలి. సాయిబాబా ఫోటో లేదా విగ్రహాన్ని పసుపు, తెలుపు, ఎరుపు పువ్వులతో అలంకరించాలి. శనగల మాలను సమర్పించడం ఈ పూజలో ప్రత్యేకమైన అంశం.

పూజా విధానం: ముందుగా వినాయకుడి పూజ చేయాలి. ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి, దేవలక్ష్మికి నమస్కారం చేయాలి. వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించి, అష్టోత్తరాలు లేదా "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని పఠించాలి. అరిటిపళ్ళు, బెల్లం ముక్కలను నైవేద్యంగా సమర్పించి, అగరుబత్తితో దూపం వేసి హారతి ఇవ్వాలి.

సాయిబాబా పూజ: వినాయకుడి పూజ తర్వాత, సాయిబాబా పూజను ప్రారంభించాలి. "ఓం శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై" అంటూ పూజను ప్రారంభించి, పాలు లేదా పంచామృతాలతో అభిషేకం చేయాలి. అక్షింతలు, పువ్వులు సమర్పించి, అష్టోత్తరాలు పఠించాలి. శ్రీసాయి సచ్చరిత్రము అధ్యాయాలు చదవడం, సాయికోటి ప్రారంభించడం మంచిది. పళ్ళు, పచ్చి శనగలు, కోవా, పొలగం, చపాతీ, బ్రెడ్, కిచ్చడి వంటి నైవేద్యాలను సమర్పించి, సాంబ్రాణి దూపం వెలిగించాలి. చివరగా మంగళహారతి ఇవ్వాలి.

నియమాలు, ఉపవాసం: ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు. పూజ చేసినవారు కటిక నేలపై పడుకోవాలి. మోగాజీవులకు అన్నం పెట్టాలి. అబద్ధాలు ఆడకూడదు, గొడవలు పడకూడదు, పిల్లలను కొట్టకూడదు. బ్రహ్మచర్యం పాటించి, సాయిబాబా నీతివాక్యాలను చదువుకోవాలి. ఒక పూట భోజనం చేయాలి.

ఇతర పూజలు: దత్తాత్రేయ, వీరబ్రహ్మేంద్ర, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి వంటి గురువులను కూడా ఈరోజు పూజించవచ్చు. పళ్ళు, స్వీట్స్, కొత్త బట్టలు ఇచ్చి గురువుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా మంచిది. ఇలా చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.




