శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
అనకాపల్లి జిల్లాలోని కోనవానిపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి, నాడు-నేడు పథకం కింద నిర్మిస్తున్న కొత్త భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో 27 మంది విద్యార్థులు గత రెండేళ్లుగా స్థానిక రామాలయంలోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిర్మాణంలో నిలిచిపోయిన పాఠశాల భవనాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.
పాఠశాలను దేవాలయంగా.. చదువు చెప్పే టీచర్లను గురుదేవులుగా భావిస్తాం. కానీ ఇక్కడ దేవాలయమే విద్యాలయంగా మారిపోతే.. అవును ఇక్కడ విద్యార్ధులు గుడిలోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇక్కడ బడిలోకి ఎంట్రీ ఇవ్వాలంటే మొదటి, రెండు తరగతులు గుడిలోనే చదువుకోవాలి. మరి దీనివెనుక ఉన్న అసలు కారణమేంటో తెలుసుకుందాం. అనకాపల్లి జిల్లాలోని ఎస్.రాయవరం మండలం తిమ్మాపురం శివారు కోనవానిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ బడికి ఒక్కటే గది. అది కూడా శిథిలావస్థకు చేరుకుంది. అంతమంది విద్యార్ధులకు ఒకే గదిలో పాఠాలు చెప్పడం కష్టంగా మారడంతో కొంతమంది పిల్లలకు స్థానిక రామాలయంలో పాఠాలు చెప్పేందుకు గ్రామపెద్దలు నిర్ణయించారు. అలా వారికి గుడే బడిగా మారింది. రెండేళ్లుగా తమ పిల్లలు గుడిలోనే పాఠాలు నేర్చుకుంటున్నారని విద్యార్ధుల పేరెంట్స్ చెబుతున్నారు. మూడేళ్ల క్రితం నాడు-నేడు పథకం ద్వారా సుమారు 43 లక్షలతో రెండు గదుల స్కూలు భవనం నిర్మాణాన్ని చేపట్టారు. భవనం స్లాబ్ వరకూ నిర్మించిన తరువాత పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత భవనం నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. దీంతో గ్రామస్తుల అనుమతితో 1,2 తరగతుల పిల్లలకు గుడిలో చదువు చెబుతున్నామంటున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మయూరి. ప్రభుత్వం స్పందించి.. నిర్మాణ దశలో ఆగిపోయిన భవనాన్ని నిర్మిస్తే.. మరింత మంది పిల్లలు పాఠశాలలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం తమ సమస్యపై స్పందించాలని కోరుతున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
టీ20 వరల్డ్‌కప్ 2026.. గిల్‌కు షాక్.. అక్షర్‌కు ప్రమోషన్!
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం
హైవేపై బ్రిడ్జికి వేలాడుతూ పుల్అప్స్.. అక్కడ నుండి..

