బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
మైనటా అనే మహిళకు బ్రౌన్ రెక్లూస్ సాలీడు కాటు వేయడంతో ఆమె ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ఆమె చర్మం పాములా ఊడిపోయి, ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. విష ప్రభావాలు వారాలపాటు కొనసాగాయి. ఈ విషపు సాలీడు కాటు నొప్పి లేకుండా మొదలై, సరైన చికిత్స లేకపోతే ప్రాణాంతకంగా మారగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాలె పురుగు.. ఇది చాలా చిన్న జీవి. వీటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. సాలీడు కాటు వేస్తే ప్రాణాంతక స్థితికి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఓ సాలెపురుగు కాటుకు గురైన మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్రౌన్ రెక్లూస్ స్పైడర్ కాటుకు గురైన ఆ మహిళ నరకయాతన పడింది. ఆమె ఒక సందర్భంలో పాము కుబుసం విడిచినట్టగా తన చర్మం ఊడిపోయినట్లు తెలిపింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైనిటా అనే మహిళ విషపూరితమైన గోధుమ రంగు సాలీడు కాటుకు గురైంది. అది కరిచిన తర్వాత ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారిపోవడంతో ఆస్పత్రి పాలైంది. వారాల తరబడి చికిత్స పొందిన తర్వాత కూడా, ఆ విష ప్రభావాలు ఆమె శరీరంపై కనిపించాయి. 2025 మే 17న తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మైనిటా ఎస్ తన అనుభవాన్ని పంచుకున్నారు. తనకు తెలియకుండానే ఒక గోధుమ రంగు సింగిల్ సాలీడు తనను కరిచిందని, దాంతో రెండు వారాల పాటు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని తెలిపింది. ఒక క్షణం తాను సాధారణంగా ఉండేదానినని, మరుక్షణం తన శరీరం కుంచించుకుపోయి.. నడవలేకపోయానని, తినలేకపోయానని తెలిపింది. స్నానం కూడా చేయలేకపోయానని, ఒకానొక సందర్బంలో తన కళ్ళు కూడా తెరవలేకపోయానని వివరించింది. ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవడంతో వైద్యులు తనను వెంటిలేటర్‌పై ఉంచారని వెల్లడించింది. హిమోగ్లోబిన్ స్థాయి వేగంగా పడిపోవడంతో తన పరిస్థితి మరింత దిగజారిపోయిందని బాధితురాలు మైనిటా చెప్పింది. తనకు ఏం జరుగుతోందో తనకే అర్థం కాలేదని, చాలా కాలం పాటు తన పరిసరాల గురించి కూడా ఏమీ తెలియని స్థితిలోకి వెళ్లిపోయినట్టు తెలిపింది. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, తను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆ విషం తన శరీరాన్ని ప్రభావితం చేస్తూనే ఉందని మెనిటా చెప్పింది. తన చర్మం పెద్ద పెద్ద ముక్కలుగా ఊడిపోతున్నట్లు కనిపించే వీడియోను కూడా ఆమె షేర్ చేసింది. సాలీడు తనను పాములాగా కుబుసం విడిచే స్థితిలోకి మార్చేసిందని వాపోయింది. బ్రౌన్ రెక్లూస్ సాలీడు యునైటెడ్ స్టేట్స్ దక్షిణ, మధ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది సాధారణంగా చీకటి, పొడి, క్లోసెట్‌లు, బేస్‌మెంట్‌లు, స్టోర్‌రూమ్‌లు వంటి మూసివేసిన ప్రదేశాలలో నివసిస్తుంది. దీని శరీరం వయోలిన్ ఆకారపు గుర్తులో ఉంటుంది. నిపుణుల ప్రకారం..ఈ సాలీడు కాటు తొలుత ఎలాంటి నొప్పిలేకుండా ఉంటుంది. కాబట్టి ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఇది తరువాత ప్రాణాంతకంగా మారుతుంది. కొన్ని కేసులలో చర్మం వాపు, నీలం రంగులోకి మారడం, బొబ్బలు, కండరాల నొప్పికి కారణమవుతాయి. తీవ్రమైన కేసులు జ్వరం, వాంతులు, తలతిరగడం, దద్దుర్లు, రక్త సంబంధిత సమస్యలు, అవయవ నష్టానికి కారణమవుతాయి. తక్షణ చికిత్స చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం
ఇలా అయిపోతున్నారేంట్రా.. హైవేపై బ్రిడ్జికి వేలాడుతూ పుల్‌అప్స్.. అక్కడ నుండి..
Boyapati Sreenu: ట్రోల్స్ పై బోయపాటి రియాక్షన్.. ఆల్రెడీ హమ్‌నే కాషన్ కీయ
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం
హైవేపై బ్రిడ్జికి వేలాడుతూ పుల్‌అప్స్.. అక్కడ నుండి..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్

