ఇలా అయిపోతున్నారేంట్రా.. హైవేపై బ్రిడ్జికి వేలాడుతూ పుల్‌అప్స్.. అక్కడ నుండి..
రీల్స్, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే మోజులో కొందరు ప్రాణాంతక స్టంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ-లక్నో హైవేపై వంతెన నుంచి ఓ వ్యక్తి వేలాడుతూ పుల్ అప్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇలాంటి ప్రమాదకర చర్యలు వారి ప్రాణాలకే కాదు, ఇతరులకు కూడా ముప్పు. యువతలో పెరుగుతున్న ఈ ధోరణిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రీల్స్ సరదానో లేక ఫేమస్ అవ్వాలనో ఈ మధ్య కొందరు ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరి ప్రాణాలు పోతున్నా యువతలో ఈ వైరల్ పైత్యం మాత్రం తగ్గడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హైవేపై ఓ వ్యక్తి ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ కన్పించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీ లక్నో హైవేపై ఓ రైల్వే వంతెన ఉంది. ఆ రైల్వే వంతెన పైనుంచి ఓ వ్యక్తి వేలాడుతూ కన్పించాడు. కింది నుంచి వాహనాలు వెళ్తుండగా.. వంతెన అంచును పట్టుకొని పుల్ అప్స్ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలియలేదు. అయితే ఆ యువకుడి స్టంట్‌ను నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్‌లు చేసే వారివల్ల వారితో పాటు పక్కవారి ప్రాణాలకు కూడా ముప్పే అని హెచ్చరిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Boyapati Sreenu: ట్రోల్స్ పై బోయపాటి రియాక్షన్.. ఆల్రెడీ హమ్‌నే కాషన్ కీయ
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

