ఒత్తిడి నుంచి బయటపడాలా.. అయితే తప్పక తినాల్సిన ఫుడ్ ఇదే!
ఈ మధ్య కాలంలో చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. కుటుంబ బాధ్యతలు, వర్క్ ప్రెషర్ వలన చాలా మంది ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. అధిక ఒత్తిడి అనేది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే ఒత్తిడి తగ్గాలి అంటే కొన్ని రకాల ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలంట. కాగా, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Updated on: Dec 23, 2025 | 12:09 PM

డార్క్ చాక్లె్ట్ : డార్క్ చాక్లెట్ తినడం వలన ఆనందం కలగడమే కాకుండా ఇది ఒత్తిడి నుంచి త్వరగా బయటపడేలా చేస్తుందంట. ప్రతి రోజూ ఒక డార్క్ చాక్లెట్ తినడం వలన ఇది సంతోషకరమైన హార్మోన్స్‌ను విడుదల చేస్తుందంట, అంతే కాకుండా ఇందులో ఒత్తిడిని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఒత్తిడితో బాధపడే వారు డార్క్ చాక్లెట్ తినడం చాలా మంచిది.

చిలకడ దుంపలు : చిలకడ దుంపలు కూడా ఒత్తిడి నుంచి బయటపడేందుకు బెస్ట్ ఫుడ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉండటం వలన ఇది మీలోని ఒత్తిడిని తగ్గించి, మీరు హాయిగా ఉండేలా చేస్తోందంట.

గ్రీన్ టీ : చాలా మంది తలనొప్పి నుంచి బయటపడటానికి అల్లం టీ లేదా నార్మల్ టీ తాగుతుంటారు. అయితే ఒత్తిడి నుంచి బయటపడటానికి ప్రతి రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం చాలా మంచిదంట. దీనిలో ఎల్ థియనిన్ అనే ప్రత్యేక సమ్మేళనం ఉండటం వలన ఇది మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుందంట.

బెర్రీస్ : ఒత్తిడితో బాధపడే వారు తమ డైట్‌లో బెర్రీస్ చేర్చుకోవడం చాలా మంచిది. బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఇవి మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయటపడేలా చేసి, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తాయి.

అరటి పండు : చాలా మంది ఇష్టంగా తినే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండ్లలో విటమిన్ బి6, పొటాషియం,ట్రిప్టోఫాన్ వంటివి పుష్కలంగా ఉండటం వలన ఒత్తిడితో బాధపడే వారు, ప్రతి రోజూ అరటి పండు తినడం వలన ఇది మిమ్మల్ని మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు.



