కరుంగలి మాల రహస్యం తెలుసా? మొదటి సారి వేసుకుంటే ఈ నియమాలు తప్పనిసరి!

Samatha

23 December 2025

ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా కరుంగలి మాల గురించే ముచ్చటిస్తున్నారు. ఈ మాల ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది.

అందువలన అసలు కరుంగలి మాల అంటే ఏంటి, దీని రహస్యం, మొదటి సారి కరుంగలి మాల ధరించే వారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

కరుంగలి మాలలోని పూసలు కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారంట. దీనికి విద్యుత్ అయస్కాంత కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందంట. చాలా శక్తివంతమైనది.

అంతేకాకుండా ఈ చెట్టుకు అనేక ఆయుర్వేద ఔషధ  గుణాలు ఉన్నాయంట. అందువలన ఇది అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా శరీరంలో ఐరన్ పెంచుతుందంట.

అందుకే ఈ కరుంగలి మాల ధరించడం ఆరోగ్యానికి చాలా మంచిది, అదే విధంగా ఈ కరుంగలి మాల పూసలు నల్లటి రంగులో ఉంటాయి, ఇవి శని, కుజుడికి సంబంధించినవి.

అందువలన దీనిని ధరించడం వలన జాతకంలో, కుజుడు, శనికి సంబంధించిన దోషాలు తొలిగిపోతాయి. అంతే కాకుండా దీనిని ధరించడం వలన దిష్టి, దుష్టశక్తుల నుంచి ఉపశమనం కలుగుతుందంట.

కరుంగలి మాలను ధరించడం వలన ఆర్థిక, కుటుంబ, మానసిక సమస్యలు తొలిగిపోయి, పాజిటివిటీ పెరుగుతుంది, అంతే కాకుండా అన్ని విధాల కలిసి వస్తుందంట.

అయితే దీనిని మొదటి సారి ధరించేవారు మంగళ వారం, గురు,శుక్ర, శని వారాల్లో, మాలను పాలతో కడిగి, పంచామృతాల్లో కాసేపు ఉంచి, మీ ఇష్టదైవం వద్ద ఉంచి పూజించి ధరించాలంట.