AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

I4C Warning: ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతులు.. క్షణాల్లో మీ ఇంటికి..

మీరు స్మార్ట్‌ ఫోన్‌లో పైరసీ సినిమాలు చూస్తున్నారా?, అయితే జాగ్రత్త మీరు త్వరలోనే పెను సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. అవును ఇది మేము చెబుతున్నది కాదు.. ఫోన్‌లలో పైరసీ సినిమాలు చూసే యూజర్స్‌కు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చేస్తున్న హెచ్చరిక. ఇలా పైరసీ సినిమాలను చూసే వారు భవిష్యత్తులో చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని ICCCC వార్నింగ్ ఇస్తోంది.

I4C Warning: ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?..  ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతులు.. క్షణాల్లో మీ ఇంటికి..
I4c Warning
B Ravi Kumar
| Edited By: |

Updated on: Dec 23, 2025 | 11:55 AM

Share

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు రిలీజ్‌లో క్యూలో ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతి సమయంలో ఉద్యోగులు, విద్యార్థులకు భారీగా సెలవులు వస్తాయి. అన్ని కటుంబాలు కలుస్తాయి. ఇలా అందరూ కలిసి సరదాగా థియేటర్‌కు వచ్చి సినిమాలు చూస్తారు. అలాంటి సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తూ భారీగా లాభాలు వస్తాయని నిర్మాతలు ఆలోచిస్తారు. అందుకే సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేస్తారు. అయితే ఈ మధ్య పైరసీ బెడద ఎక్కువై స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న ప్రతి ఒక్కరూ.. ఫోన్‌లో పైరసీ సినిమాలు డౌన్‌లోడ్ చేసి చూస్తారు. ఇలాంటి వారికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇల్లీగల్ మొబైల్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి పైరసీ సినిమాలు చూస్తే.. భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది.

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ సైబెర్ క్రైమ్ పై అవగాహన్ కల్పించేందుకు I4C ని నిర్వహిస్తుంది. దీనికి సంభందించిన సైబర్ దోస్త్ I4C ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ఒక అధికారిక పోస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే చలా మంది మొబైల్ యూజర్లు Pikashow వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి సినిమాలు చూస్తున్నారని.. ఇలా సినిమాలు చూడటం వల్ల యూజర్స్ డేటా, భద్రతకు ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతే కాకుండా ఇలాంటి చర్యలు నేరంతో సమానం అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. పైరసీ సినిమాలు అందించే Pikashow వంటి యాప్‌లు సురక్షితమైనవి కావని సైబర్ దోస్త్ తెలిపింది. అయితే లక్షలాది మంది యూజర్లు ఈ యాప్‌లను ఉపయోగించి తమ వ్యక్తిగత డేటాను తామే ప్రమాదంలో పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఉచితంగా సినిమాలు అందించే యాప్‌లను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. వాటిలోని మాల్వేర్, స్పైవేర్‌ను డివైస్‌లోకి చేరే ప్రమాదం ఉందని తెలిపింది. దీని వల్ల బ్యాంకింగ్ సమాచారం, లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యే ప్రమాదంతో పాటు బ్యాంకు ఖాతాలు కూడా ఖాళీ కావచ్చు అని హెచ్చరించింది. అలాగే పైరసీ సినిమాలు లేదా కంటెంట్ చూడటానికి ఇలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తే, భవిష్యత్తులో చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని 14C తన పోస్ట్‌లో పేర్కొంది.

ఇప్పటికే ఐ బొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్ సైట్ల సూత్రధారి ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని వద్ద సుమారు 50 లక్షల మందికి సంభందించిన యూజర్ల డేటా ఉందనే అంశం ఆందోళన కలిగిస్తుంది. ఇతను 21వేలకు పైగా పిరసీ సినిమాలను హార్డ్‌డ్రైవ్‌లలో స్టోర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చేసిన హెచ్చరికలపై అప్రమత్తంగా వుండాలి లేదంటే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనే సామెత ఉంది కదా

I4c Warning

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి