- Telugu News Photo Gallery Spiritual photos These are the zodiac signs that will get rid of debt problems with the blessings of Jupiter
లక్కు వీరిదేరోయ్.. 2026లో గురు అనుగ్రహంతో అప్పులు తీరిపోయే రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఇదొక్కటి. అయితే ఎవరి జీవితంలోనైతే గురు గ్రహం మంచి స్థానంలో ఉంటుందో, వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా గురు అనుగ్రహం ఉన్నవారికి ఆర్థికంగా కలిస వస్తుంది. అయితే 2026లో కొన్ని రాశుల వారికి గురు గ్రహం అనుగ్రహం కలగనున్నదంట. దీని వలన ఆ రాశుల వారు అప్పుల ఊబిలో నుంచి బయటపడతారని చెబుతున్నారు నిపుణులు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Updated on: Dec 23, 2025 | 11:18 AM

వృషభ రాశి : వృషభ రాశి వారికి 2026 లక్కీ ఇయర్ అని చెప్పాలి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి గురు గ్రహం లాభస్థానంలో శని సంచారం చేయడం వలన కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఆదాయం రెట్టింపు అయ్యి, అప్పుల బాధలు తీరిపోతాయి. ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. ఈ రాశి వారికి గురు గ్రహం ధన స్థానంలో ఉండటం వలన డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అనుకోని మార్గాల ద్వారా కొత్త ఆదాయం పుట్టుక రావడంతో చాలా ఆనందంగా గడుపుతారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారిపై గురు గ్రహం అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి గరువు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందున, మే చివరిలోగ ఈ రాశి వారు అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఉద్యోగ ప్రమోషన్స్ పొందడం, కొత్త ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. అన్నివిధాల కలిసి వస్తుంది.

మకర రాశి : మకర రాశి వారికి 2026లో ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి వారు అనుకోని మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి గురు గ్రహం సప్తమ స్థానంలో ఉండటం వలన వీరు అప్పుల సమస్యల నుంచి బయటపడి, ఈ సంవత్సరం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు 2026 సంవత్సరంలో చాలా ఆనందంగా గడుపుతారు. దీనికి కారణం వీరు రుణ బాధల నుంచి బయటపడటమే, ఎవరైతే చాలా రోజుల నుంచి అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో, వారు 2026లో ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోయి, ఆనందంగా గడుపుతారు.



