- Telugu News Photo Gallery Business photos See the gold and silver prices in Hyderabad, Vijayawada and Visakhapatnam on December 23 2025
Gold Prices: షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే
బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. తులం బంగారం లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది. ఇక వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. సోమవారం నుంచి బంగారం ధరలకు బ్రేకులు పడటం లేదు. భారీ స్థాయిలో పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి.
Updated on: Dec 23, 2025 | 10:24 AM

బంగారం ధరలు సోమవారం నుంచి భారీగా పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా వేలకు వేలు పెరుగతూ కొనుగోలు చేసేవారికి షాక్ ఇస్తున్నాయి. సోమవారం రూ.వెయ్యి వరకు పెరిగిన గోల్డ్ రేటు.. మంగళవారం ఏకంగా రూ.2400 పెరిగింది. తులం బంగారం రూ.లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రూ.1,38,550గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,36,150గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.2400 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,27,000గా వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,24,800గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.2200 పెరిగింది.

విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,38,550గా ఉంది. సోమవారం రూ.1,36,150 వద్ద ఉండగా.. నిన్నటితో పోలిస్తే రూ.2,400 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,27,000 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నంలో కూడా ఈ ధరలే కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,39,310కి చేరుకుంది. నిన్న ఈ ధర రూ.1,37,130గా ఉంది. సోమవారంతో పోలిస్తే రూ.2180 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,700గా ఉంది. నిన్న దీని ధర రూ.1,25,700 వద్ద కొనసాగింది. అంటే రూ.2 వేలు పెరిగింది.

ఇక బంగారంతో పోటీగా వెండి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై ఇవాళ రూ.3 వేలు పెరిగింది. సోమవారం రూ.2,31,100గా ఉండగా.. మంగళవారం నాటికి రూ.2,34,000కు చేరుకుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు పలుకుతున్నాయి.




