చలికాలంలో మీకు ఎక్కువ చలి ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
Samatha
23 December 2025
శీతాకాలం ప్రారంభమైంది. దీంతో సాయంత్రం అయితే చాలు చలి చంపేస్తుంటుంది. దీంతో చాలా మంది చలి నుంచి బయటపడాలి అనుకుంటారు.
చలి నుంచి బయటపడటానికి వెచ్చటి దుస్తులు ధరించడం, తమ ఆహారంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవడం చేస్తుంటారు.
అయితే ఈ చలికాలంలో చలిగా అనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో చూద్దాం.
జీవక్రియ మందగించడం వలన శరీరం తక్కువ శక్తిని పొందుతుంది. దీని వలన తగ్గిన శక్తి శరీరానికి తక్కువ వేడినివ్వడం వలన చలి ఎక్కువగా అనిపిస్తుందంట.
అదే విధంగా చలి ఎక్కువ అనిపించడానికి థైరాయిడ్ కూడా కారణం. శరీరంలో థైరాయిడ్ స్థాయిలు తక్కువ ఉండటం వలన కూడా చలి ఎక్కువ ఉంటుందంట.
ఎవరికైతే బలహీనమైన రక్తప్రసరణ ఉంటుందో అలాంటి వ్యక్తి ఎక్కువ చలికి గురి అవ్వడం జరుగుతుందంట.
అలాగే శీతాకాలంలో చాలా చలి అనిపించడానికి ముఖ్య కారణం కొవ్వు శాతం కూడా తక్కువగా ఉండటం, శరీరంలో కొవ్వు తక్కువ ఉంటే చలి ఎక్కువ ఉంటుందంట.
అదే విధంగా ఎవరికైతే బలహీనత ఎక్కువ ఉండటం, తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉంటారో, వారికి చలి ఎక్కువగా ఉంటుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము తోకతో సమస్యల్లో పడే వారు వీరే.. జాగ్రత్త పడకపోతే నష్టమే
పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు ఇవే.. విస్మరిస్తే బతకడం కష్టమే!
న్యూ ఇయర్లో బీచ్ ట్రిప్.. ఇక్కడికి వెళితే ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదంట!