ఆ జబర్దస్త్ నటుడు దారుణంగా అవమానించాడు.. ఫోన్ చేసి అలా మాట్లాడాడు..
ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది కమెడియన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు మరికొంతమంది దర్శకులుగా, హీరోగానూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. అయితే జబర్దస్త్ లో చాలా మంది కమెడియన్స్ నటించి అలరించారు వారిలో నెల్లూరు నీరజ ఒకరు. ఈమె చాలా మందికి తెలిసే ఉంటుంది. యూట్యూబ్ లో ఫేమస్ అయిన ప్రసాద్ బెహరా తో కలిసి కొన్ని వీడియో చేశారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆమె. ఆతర్వాత జబర్దస్త్ లో కనిపించి మెప్పించారు. ఇక డీజే టిల్లు సినిమాలో సైతం ఆమె కనిపించారు. అయితే ఆమె ఓ జబర్దస్త్ నటుడి పై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జబర్దస్త్ నటుడు తనను దారుణంగా అవమానించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?
నెల్లూరు నీరజ చెప్పింది ఎవరిగురించో కాదు ప్రముఖ కమెడియన్ చమ్మక్ చంద్ర. జబర్దస్త్ షో ద్వారా చంద్ర పాపులర్ అయ్యాడు. ఆ క్రేజ్ తోనే కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అయితే నీరజ చంద్ర పై గతంలో కొన్ని ఆరోపణలు చేశారు. నెల్లూరు నీరజ తన భర్త సుబ్బు క్యాటరింగ్ వ్యాపారం కారణంగా జబర్దస్త్ షూటింగ్‌కు హాజరు కాలేకపోయినప్పుడు చంద్ర దారుణంగా మాట్లాడారు అని తెలిపారు. చంద్ర టీమ్‌లో ఐదు ఎపిసోడ్‌లు చేశాక, ఆరో ఎపిసోడ్‌కు తన భర్త సుబ్బు నెల్లూరులో రెండు లక్షల విలువైన క్యాటరింగ్ ఆర్డర్ కోసం వెళ్ళవలసి వచ్చిందట. ఒక రోజు షూటింగ్‌కు బదులుగా 500 మందికి భోజనాలు అందించే ఆ వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారట. సుబ్బు రాలేను అని ముందే చంద్రకు తెలియజేశారని నీరజ తెలిపారు.
మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన
అయితే, చంద్ర ఫోన్ చేసి “క్యాటరింగ్ వ్యాపారం ఉన్నప్పుడు కామెడీ షోలు ఎందుకు చేయాలి, అదే చేసుకోమను”అంటూ తనతో ఫోన్ లో దురుసుగా మాట్లాడారని అది ఆమెను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు నీరజ. ఆయన మాటలు తీవ్రంగా బాధించాయని నీరజ అన్నారు. అలాగే నెల్లూరు నీరజ జబర్దస్త్‌లో టీం లీడర్‌గా రావాలని ప్రయత్నించినప్పుడు కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించారని, అయితే రాకెట్ రాఘవ మాత్రం తనకు మద్దతు ఇచ్చారని నీరజ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.
చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.








