ఆర్బీఐ తీసుకువస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 2026 నుండి బ్యాంకులు వెండిపై కూడా రుణాలు అందించనున్నాయి. బంగారు రుణాల మాదిరిగానే, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆభరణాలు, కాయిన్స్, బిస్కెట్ల రూపంలో ఉన్న వెండిని తాకట్టు పెట్టుకుని లోన్లు ఇస్తాయి. వెండి పెరుగుతున్న నేపథ్యంలో ఇది ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.