హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం 85 సంవత్సరాల పాటు సుదీర్ఘ అధ్యయనం చేసింది. డబ్బు, పేరు ప్రఖ్యాతలు, విజయంతో కాకుండా, మంచి మానవ సంబంధాలే మనిషికి నిజమైన సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయని ఈ పరిశోధన తేల్చింది. ఎక్కువ మందితో కాకుండా, నమ్మకమైన కొద్దిమందితో బలమైన బంధాలు కలిగి ఉండడమే కీలకమని వెల్లడించింది.