వ్యాయామం ద్వారా లభించే రోగనిరోధక శక్తి, వృద్ధాప్య నిరోధం, బ్రెయిన్ చురుకుదనం, అందం వంటి ప్రయోజనాలను బీటెన్ అనే జీవపదార్థం అందిస్తుంది. దీనిని కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి. చైనా శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, పాలకూర, బీట్రూట్ వంటి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరంలో బీటెన్ ఉత్పత్తిని ప్రేరేపించి, వ్యాయామం చేయలేని వారు కూడా అదే ఫలితాలను పొందవచ్చు.