AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారిగా 20 వేలకుపైగా బాతులు మృతి.. బాబోయ్.! మళ్లీ వైరస్ వచ్చేసింది..

కుట్టనాడ్‌లోని ఏడు పంచాయతీలలో బర్డ్ ఫ్లూ కారణంగా 20 వేల కంటే ఎక్కువ బాతులు చనిపోయాయని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. ప్రభావిత ప్రాంతాల చుట్టూ ఒక నిర్దిష్ట కిలోమీటరు మేరకు కోళ్ల అమ్మకాలు, రవాణాపై ఆంక్షలు ఉంటాయి. ఆ వివరాలు ఇలా..

ఒక్కసారిగా 20 వేలకుపైగా బాతులు మృతి.. బాబోయ్.! మళ్లీ వైరస్ వచ్చేసింది..
H5 Bird Flu
Ravi Kiran
|

Updated on: Dec 23, 2025 | 1:35 PM

Share

కేరళలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అల్పౌజాలో పలు బాతులు మరణించగా.. వాటి నమూనాలను భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. దీంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తక్షణమే నివారణ చర్యలను తీసుకుంది. వ్యాధి సోకిన ప్రాంతాల చుట్టూ ఒక నిర్దిష్ట కిలోమీటరు పరిధిలో కోళ్లు, పక్షులు అమ్మకాలు, రవాణాపై ఆంక్షలు విధించారు. రిజల్ట్స్ వచ్చీరాగానే వ్యాధి గుర్తించబడిన ప్రాంతాల్లో పక్షులను చంపడం లాంటి తదుపరి చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది.

జిల్లాలోని ఎనిమిది పంచాయతీలలో ఈ వ్యాధి నమోదైంది. ప్రతి వార్డులో ఒకటి. కుట్టనాడ్‌లోని ఏడు పంచాయతీలలో 20,000 కి పైగా బాతులు బర్డ్ ఫ్లూ కారణంగా మరణించాయని నిర్ధారించారు. నెడుముడి, చెరుతన, కరువట్ట, కార్తీకప్పల్లి, అంబలప్పుళ సౌత్, పున్నప్రా సౌత్, తకజి లాంటి ప్రాంతాల్లో బాతులు చనిపోయాయి. ఇంతలో, కొట్టాయం జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. కురుపంతర, మంజూర్, కల్లుపురక్కల్ మరియు వెల్లూరు వార్డులలో ఈ వ్యాధిని గుర్తించారు. కోళ్లు, పిట్టలలో బర్డ్ ఫ్లూను గుర్తించారు.

బర్డ్ ఫ్లూ – లక్షణాలు

  •   జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, అలసటతో మొదలవుతుంది.
  • కండ్లకలక, జీర్ణ సమస్యలు(వాంతులు, విరేచనాలు), తీవ్రమైన శ్వాస సమస్యలు, ఛాతీ నొప్పి, అవయవాల వైఫల్యం కూడా సంభవించవచ్చు.
  • మానవులకు సాధారణంగా ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా సోకుతుంది. ఇది సోకిన పక్షులతో ఎక్కువ కాలం సన్నిహితంగా ఉండటం వల్ల వస్తుంది.
  • ప్రారంభ లక్షణాలు సాధారణంగా 2-5 రోజుల తర్వాత కనిపిస్తాయి.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు