Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Srivani Trust: తిరుమల శ్రీవాణి ట్రస్టుకు విశేష స్పందన.. వెంకన్న హుండీకి చేరిన రూ.రూ.1000 కోట్ల విరాళాలు..

శ్రీవాణి ట్రస్టు..ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చర్చ గా మారిన టిటిడి పథకం ఇది. అయితే భక్తుల నుంచి విశేష స్పందన పొందిన శ్రీవాణి ట్రస్టు ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్ల విరాళాలను సమకూర్చింది. నాలుగేళ్లలో విమర్శలను అధిగమించి ఎట్టకేలకు వెయ్యికోట్ల విరాళాలను వెంకన్న ఆదాయానికి జమ చేసింది. మొత్తానికి ఈ పథకం కాంట్రవర్సీతోనే పాపులారిటీ పెరిగిపోయిందంటున్నారు పలువురు విశ్లేషకులు.

Tirumala Srivani Trust: తిరుమల శ్రీవాణి ట్రస్టుకు విశేష స్పందన.. వెంకన్న హుండీకి చేరిన రూ.రూ.1000 కోట్ల విరాళాలు..
TTD
Follow us
Raju M P R

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 04, 2023 | 7:45 AM

తిరుమల తిరుపతి, సెప్టెంబర్: తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలతో వెంకన్న హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే శ్రీవాణి విరాళాల మొత్తం వెయ్యి కోట్లను అధిగమిచ్చింది. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ సింపుల్ గా శ్రీవాణి ట్రస్ట్ గా భక్తులు పిలేచే శ్రీవాణి స్కీమ్ తిరుమలేసుడికి కాసులు కురిపిస్తుంది. టీటీడీ అమలు చేస్తున్న చాలా ట్రస్టుల్లో శ్రీవాణి ట్రస్టు ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. అనేక విమర్శలు వివాదాలతో తెరమీదకి కూడా వచ్చింది. 2018 లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు శ్రీవాణి పేరుతో ట్రస్టు ను ప్రారంభించింది. టిటిడి భక్తులకు ప్రివిలైజ్ గా విఐపి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది. రూ.10 వేలు విరాళంగా ఇస్తే రూ. 500ల విఐపి దర్శనం టికెట్ తో శ్రీవారి దర్శనం అవకాశం కల్పిస్తోంది. ఇలా ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథ మార్ధం నాటికి రూ. 1000 కోట్ల విరాళాలు స్వీకరించే దిశగా టిటిడి అడుగులు వేసి సక్సెస్ అయ్యింది.

ట్రస్టు ప్రారంభమైనప్పటి నుంచి టీటీడీ రాష్ట్ర దేవాదాయ శాఖ, సమరసత సేవా ఫౌండేషన్ తో కలిపి విరాళాలను శ్రీవాణి ట్రస్ట్ కు నిధులను సేకరిస్తుంది. ఇలా సేకరించిన నిధులను డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేసిన టీటీడీ పలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను చేసింది. వడ్డీ రూపంలో వచ్చే మొత్తాన్ని ట్రస్ట్ లక్ష్యాల కోసం ఖర్చు చేస్తుంది. మతమార్పిడులు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణం తో పాటు జీర్ణోదరణకు నేచుకొని ఆలయాల పునర్నిర్మాణం ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీ మత్స్యకార గ్రామాలు కాలనీల్లో భజన మందిరాలు నిర్విస్తోంది. 2018 ఆగస్టు 28 ఇలాంటి తీర్మానంలో టీటీడీ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల పునరుద్ధరణ జీర్నోదరణకు నోచుకోని ఆలయాల పున్న నిర్మాణం, భజన మందిరాల నిర్మాణంకోసం చేయగా జూన్ 2023 లో టీటీడీ సాయంతో నిర్మించిన ఆలయాల అర్చకుల కోసం రూ. 5 వేలు ట్రస్టు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.

ఇక ఈ మధ్యనే శ్రీవాణి ట్రస్ట్ నిధులపై శ్వేత పత్ర విడుదల చేసిన టీటీడీ పక్కా లెక్కలు ప్రకటించింది. రూ.880 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళంగా వచ్చాయని 9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు కూడా ప్రకటించింది. రూ.603 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయగా రూ. 38 కోట్ల వడ్డీ వచ్చిందని, రూ. 120 కోర్టు ఆలయాల నిర్మాణం కోసం ఖర్చు చేశామని కూడా గత నెలలో ప్రకటించింది. 2273 ఆలయాలు గోశాలలు భజన మందిరాల నిర్మాణానికి రూ.227 కోట్లు కేటాయించామని, ఏపీ తెలంగాణ తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల్లో 127 పురాతన ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ. 139 కోట్లు కేటాయింపు జరిగిందని టిటిడి ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రూ. వెయ్యి కోట్లకు శ్రీవాణి ట్రస్టు విరాళాలు చేరినట్లు టిటిడి ప్రకటించింది. దీంతో ట్రస్టు ప్రారంభించిన 4 ఏళ్ల లో భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించినట్లు అయింది. తాజా లెక్కలు ప్రకారం శ్రీవాణి ట్రస్టు కు ఇప్పటి వరకు భక్తుల నుంచి రూ 970 కోట్లు విరాళాలు రాగా వడ్డి రూపంలో రూ. 36 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇవి కూడా చదవండి

– 2018 ఆగష్టులో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభం కాగా..

– 2019 అక్టోబర్ నుంచి భక్తులకు శ్రీవాణి ట్రస్ట్ అందుభాటులోకి వచ్చింది.

– 2019లో రూ. 26.25 కోట్లను19737 మంది భక్తులు విరాళంగా అందించారు.

– 2020లో రూ.70.21 కోట్లను 49282 మంది భక్తులు విరాళంగా అందించారు.

– 2021లో రూ. 176 కోట్లను లక్షా 31 వేల మంది భక్తులు విరాళంగా అందించారు.

– 2022లో రూ. 282.64 కోట్లను 2లక్షల 70 వేల మంది భక్తులు విరాళంగా అందించారు.

– ఇక 2023లో ఇప్పటి వరకు రూ.268.35 కోట్లను లక్ష 58 వేల మంది భక్తులు విరాళంగా అందించి శ్రీవారిని దర్శించుకున్నట్లు టిటిడి ప్రకటించింది.

శ్రీవాణి ట్రస్ట్ నిధులుతో 176 పురాతన ఆలయాల పునరుద్దరణ పనుల కోసం వినియోగిస్తున్నట్టుగా టిటిడి చెప్పింది. ఇక బీసీ, ఎస్సీ, ఎస్సీ కాలనీ ల్లో 2273 నూతన ఆలయాల నిర్మాణాలు చేపట్టిన టిటిడి 501 ఆలయాలకు ధూపధీప నైవేధ్యం కింద ప్రతి నెల రూ. 5 వేలు చొప్పున అందజేస్తోంది. ఇక ఎన్నో విమర్శలు వివాదాలు శ్రీవాణి ట్రస్ట్ ఎదుర్కొన్నా భక్తులు మాత్రం పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ శ్రీవారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపడంతో శ్రీవాణి ట్రస్ట్ సక్సెస్ అయ్యింది. దీంతో పురాతన ఆలయాల పునర్నిర్మాణం, ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల జీర్ణోద్ధరణలో భక్తులను టిటిడి భాగస్వామ్యం చేసింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు