Dream Interpretation: మీ కలలో ఈ దేవతలు కనిపిస్తే నిజంగా మీ పంట పండినట్లే.. వివరాలివే..!
Dream Interpretation: స్వప్న శాస్త్రంలో, ప్రతి కలకి కొన్ని అర్థాలు చెప్పడం జరిగింది. స్వప్న శాస్త్రంలో ప్రతి కలకు ఒక కారణం ఉంటుందని, దానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందులో పొందుపరిచారు. ఈ కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల సూచనలను ఇస్తాయి. కలలో చాలా సార్లు దేవాలయం కనిపిస్తుంది. లేదా ఏదో ఒక దేవుడి దర్శనం ఉంటుంది. మీ కలలో కూడా దేవత, దేవుడి రూపం కనిపించిందా? ఏ దేవుడు, దేవత కలలో వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Dream Interpretation: స్వప్న శాస్త్రంలో, ప్రతి కలకి కొన్ని అర్థాలు చెప్పడం జరిగింది. స్వప్న శాస్త్రంలో ప్రతి కలకు ఒక కారణం ఉంటుందని, దానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందులో పొందుపరిచారు. ఈ కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల సూచనలను ఇస్తాయి. కలలో చాలా సార్లు దేవాలయం కనిపిస్తుంది. లేదా ఏదో ఒక దేవుడి దర్శనం ఉంటుంది. మీ కలలో కూడా దేవత, దేవుడి రూపం కనిపించిందా? ఏ దేవుడు, దేవత కలలో వస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాటి అర్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కలలో దుర్గా మాత కనిపిస్తే..
స్వప్న శాస్త్రం ప్రకారం.. దుర్గ మాతను కలలో చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కలలో కనిపించే దుర్గమాత మీ జీవితంలోని అన్ని కష్టాలు త్వరలో తొలగిపోతాయని సూచిస్తుంది. మీ కలలో మాతా దుర్గ ఎరుపు రంగు దుస్తులు ధరించి నవ్వుతున్నట్లు మీరు చూసినట్లయితే, మీ జీవితంలో త్వరలో సానుకూల మార్పులు రాబోతున్నాయని అర్థం. కలలో దుర్గామాత సింహంపై స్వారీ చేస్తూ కనిపిస్తే, మీ సమస్యలన్నీ త్వరలో తీరబోతున్నాయని అర్థం. మీ కలలో మాతా దుర్గా కోపంగా ఉన్న రూపాన్ని చూస్తే, అది మీరు పెద్ద తప్పు చేసినట్లు సూచిస్తుంది. మీరు అమ్మవారికి క్షమాపణలు చెప్పాలి.
కలలో శివలింగాన్ని చూడటం..
స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో శివలింగాన్ని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంటే భోలేనాథ్ ఆశీస్సులు మీపై ఉండబోతున్నాయని అర్థం. శివలింగం కల మీరు మీ చెడు పనుల ఫలాలను పొందారని, శివుని దయతో మీ సమస్యలన్నీ తీరబోతున్నాయని చెబుతుంది. శివలింగం కలలో వస్తే మీ జీవితంలో పురోగతిని సూచిస్తుంది.
కలలో రాముడు కనిపిస్తే..
మీ కలలో రాముడిని చూస్తే, మీ జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయని అర్థం. కలలో శ్రీరాముడిని చూడడం అంటే మీరు మీ విధులను సక్రమంగా నిర్వహించాలని, ఎల్లప్పుడూ ప్రజలతో న్యాయంగా ప్రవర్తించాలని అర్థం.
శ్రీకృష్ణుడు, విష్ణువుల దర్శనం..
మీకు కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే, త్వరలో మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నాడని అర్థం. వారితో మీ ప్రేమ సంబంధం ప్రారంభమవుతుంది. ప్రేమతో పాటు, మీరు ఎవరితోనైనా స్నేహాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఆ వ్యక్తి మీకు చాలా అదృష్టవంతుడని నిరూపిస్తాడు. ఈ కల ప్రేమ సంబంధాలలో విజయాన్ని సూచిస్తుంది. మీ కలలో విష్ణువు కనిపిస్తే మీరు మీ పనిలో విజయం సాధిస్తారని అర్థం.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత పరమైన గ్రంధాలు, వేద నిపుణులు చెప్పిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..