Indore Baby News: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తాగునీటి సరఫరా వ్యవస్థలో మురుగునీరు కలవడంతో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీటిని తాగి 6 నెలల పసికందు మరణించగా, వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడంతో ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు.