ఊదా రంగు క్యాబేజీ ఎప్పుడైనా తిన్నారా.. దీని లాభాలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

Samatha

2 January 2026

క్యాబేజీ అందరికి తెలుసు. ఎక్కువగా చాలా మంది గ్రీన్ కలర్‌లో ఉండే క్యాబేజీ మాత్రమే చూసి ఉంటారు. కానీ ఊదా రంగు క్యాబేజీ కూడా ఉంటుంది.

ఊదా రంగు క్యాబేజీ

ప్రతి సీజన్‌లో లభించే కూరగాయాల్లో ఊదా రంగు క్యాబేజీ కూడా ఒకటి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి, దీనిని తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట.

ఆరోగ్య ప్రయోజనాలు

ఊదా రంగు క్యాబేజీ బరువు తగ్గాలి అనుకునేవారికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది.

బరువు నియంత్రణ

ఊదా రంగు క్యాబేజీలో ఫైటోన్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఆర్థ రైటిస్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

చిన్న వయసులోనే ఎవరు అయితే కీళ్ల నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతున్నారో, వారు తమ డైట్‌లో ఊదా రంగు క్యాబేజీ చేర్చుకోవడం చాలా మంచిదంట.

చిన్న వయసులో కీళ్లనొప్పులు

అలాగే, గుండె సమస్యలతో బాధపడుతున్నవారు తమ ఆహారంలో ఊదా రంగు క్యాబేజీని చేర్చుకోవడం వలన ఇది గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె  ఆరోగ్యానికి

ఆకుపచ్చ రంగు క్యాబేజీ కంటే, మధుమేహం ఉన్నవారు ఊదా రంగు క్యాబేజీ తినడం మంచిదంట. ఇందులో ఉండే ఆంథోసైనిన్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

డయాబెటీస్ 

అదే విధంగా ఊదా రంగు క్యాబేజీ తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందంట. ఇందులో ఉండే శోథనిరోధక లక్షణాలు శరీరానికి మేలు చేస్తాయి.

రోగనిరోధక శక్తి