జాగ్రత్త గురూ.. చికెన్ ఇలా వండితే ప్రమాదమే!

Samatha

1 January 2026

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ తింటుంటారు. కానీ చికెన్ వండటంలో మిస్టేక్ చేస్తే సమస్యలు తప్పవంట.

అయితే కొన్ని సార్లు చికెన్ అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, విరేచనాలకు దారితీస్తుంది.  దీనికి గల కారణాలు ఏవో చూద్దాం.

కొంత మంది చికెన్ వండే క్రమంలో దానిని ముందుగా కడుగుతుంటారు. కానీ చికెన్ కడగడం వలన దానిపై ఉండే సాల్మొనెల్లా వంటి హానికర బ్యాక్టీరియా, ఇతరపాత్రలపై వ్యాపించి, అనారోగ్య సమస్యలను సృష్టిస్తుంది.

అలాగే కొంత మంది చికెన్ పైన చూసి ఉడికింది అని తింటుంటారు. కానీ చికెన్ లోపలి నుంచి మెత్తగా ఉడికించుకోవాలంట, లేకపోతే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురు అవుతాయి.

ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే వండకుండా చాలా సేపు బయట పెట్టి వండటం వలన కూడా కడుపు సంబంధిత సమస్యలు  అధికం అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

అలాగే కొంత మంది మిగిలిపోయిన చికెన్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటారు. కానీ ఇది కూడా మంచిది కాదంట. దీని వలన విరచాలు, కడుపు నొప్పి, వాంతులు అవుతుంటాయంట.

ఇక కొంత మంది  ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్ తింటుంటారు. కానీ ఇలా తినడం వలన కూడా అనారోగ్య సమస్యలు దరి చేరుతాయంట.

అందుకే చికెన్ వడే సమయంలో, అలాగే చికెన్ తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉండొచ్చునంట.