Surya Dev: సమస్త లోకమంతా పూజించే సూర్యుడు ఎవరిని పూజిస్తారు? వెరీ ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..
Surya Dev: సూర్యుడు శక్తే.. సూర్యుడికి ప్రత్యేక హోదాను తెచ్చిపెట్టింది. సూర్యుడిని మొత్తం తొమ్మిది గ్రహాలకు అధిపతిగా కూడా పిలుస్తారు. గ్రహాలకు రాజు అయినప్పటికీ ఆయనా ఓ భక్తుడే. మరి సూర్యుడు ఎవరిని పూజిస్తారు? ఎవరిని ఆరాధిస్తారు? ఇంట్రస్టింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు.. సూర్యుడి జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం.

Surya Dev: సూర్యుడు శక్తే.. సూర్యుడికి ప్రత్యేక హోదాను తెచ్చిపెట్టింది. సూర్యుడిని మొత్తం తొమ్మిది గ్రహాలకు అధిపతిగా కూడా పిలుస్తారు. గ్రహాలకు రాజు అయినప్పటికీ ఆయనా ఓ భక్తుడే. మరి సూర్యుడు ఎవరిని పూజిస్తారు? ఎవరిని ఆరాధిస్తారు? ఇంట్రస్టింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు.. సూర్యుడి జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం.
సూర్యుడు ఎలా ఆవిర్భవించాడు..
ఈ ప్రపంచంలో దేవుణ్ణి ఎవరూ చూడలేదని అంటారు. కానీ, కనిపించేది ఇద్దరే ఇద్దరు దేవుళ్లు.. వారే సూర్యచంద్రులు అని చెబుతుంటారు జనాలు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు, చంద్రుడు రెండింటినీ గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే చంద్రుడు భూమికి ఉపగ్రహంగా ఉంది. ఈ జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాలలో సూర్యుడు రాజుగా, చంద్రుడు రాణిగా మానసిక కారకంగా పరిగణించడం జరిగింది.
సూర్యుడు లేకుండా విశ్వసం మనుగడను ఊహించలేమని సైన్స్ కూడా చెబుతోంది. వేదాలలో సూర్యుడిని ప్రపంచానికి ఆత్మ అని అంటారు. భూమిపై జీవి మనుగడకు కారణం సూర్యుడు మాత్రమే అని, అందుకే భారతదేశంలో వేద కాలం నుండి సూర్యుని ఆరాధన ప్రబలంగా ఉంది. వేదాలలోని శ్లోకాలలో సూర్య భగవానుడి పేరు అనేక చోట్ల స్తుతించడం జరిగింది.
సృష్టి ప్రారంభంలో.. బ్రహ్మ నోటి నుండి ‘ఓం’ అనే పదం ఉచ్ఛరించబడింది. అది సూర్యుని ప్రారంభ సూక్ష్మ రూపం. ఆ తర్వాత భువ, స్వ అనే పదాలు పుట్టాయి. ఎప్పుడైతే ఈ మూడు పదాలు ‘ఓం’ అనే దేహ రూపంలో కలిసిపోయాయో, అప్పుడు సూర్యుడు స్థూల రూపాన్ని పొందాడు. విశ్వం ప్రారంభంలో జన్మించినందున.. సూర్యుడికి ఆదిత్య అని పేరు పెట్టారు.
ఈ సూర్య భగవానుడి జన్మ కథ కూడా చాలా ప్రాచుర్యం పొందింది. దీని ప్రకారం.. మరీచి బ్రహ్మ కుమారుడు, మహర్షి కశ్యపుడు మరీచి కుమారుడు. అతను ప్రజాపతి దక్ష కుమార్తె దితి, అదితిని వివాహం చేసుకున్నాడు. దితి నుండి రాక్షసులు జన్మించారు. అదితి దేవతలకు జన్మనిచ్చింది. వీరంతా ఎప్పుడూ ఒకరితో ఓకరు పోట్లాడుకునేవారు.
వీరి పోట్లాటను చూసిన మాతృమూర్తి అదితి చాలా బాధపడిపోయేది. అలా ఆమె సూర్య భగవానుని పూజించడం ప్రారంభించింది. సూర్యదేవుడు ఆమె తపస్సుకు సంతసించి అతనికి కొడుకుగా పుట్టే వరం ఇచ్చాడు. కొంతకాలం తర్వాత ఆమె గర్భవతి అయింది. గర్భం దాల్చిన తర్వాత కూడా.. అదితి కఠినమైన ఉపవాసం పాటించింది. దాని కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. మహర్షి కశ్యపుడు ఈ విషయంలో తీవ్ర ఆందోళన చెందాడు. పిల్లల కోసం ఇలా చేయడం సరికాదని, ఆమెకు వివరించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె తన సంకల్పాన్ని వీడలేదు. తనకు, తన పిల్లలకు ఏమీ కాదని, కడుపులో పెరుగుతుంది సూర్యుడి స్వరూపమని అదితి కష్యపుడికి వివరించింది. ఒకానొక శుభ సమయంలో అదితికి మగ బిడ్డ జన్మించాడు. అతనే సూర్యుడు. దేవతలకు వీరుడు అయ్యాడు. రాక్షసులను అదుపు చేశాడు. అదితి గర్భం నుంచి జన్మించినందున.. ఆదిత్య అని పిలువబడ్డాడు.
సూర్యభగవానుడు ఎవరిని పూజిస్తాడు?
సూర్యుడు దేవదేవుడైన శివుడిని ఆరాధించేవారు. మహాదేవుడు సూర్య భగవానుడికి ప్రియమైన ఆరాధకుడిగా ఉన్నారు. శని దేవుడి గురువును భోలేనాథ్‌గా కూడా పేర్కొంటారు. ఒక్క సూర్య భగవానుడే కాదు.. శ్రీరాముడు, బ్రహ్మ, హనుమాన్, మాతా పార్వతి, కాళీ, నారాయణుడుచే కూడా ఆరాధించబడిన దేవుడు పరమేశ్వరుడు. శివుడు అంటే సూర్యుడికి ఎనలేని భక్తి. నిత్యం శివ నామ స్మరణలో ఉంటారట.
గమనికం: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం మత గ్రంధాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..