AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులో సూపర్‌ లవ్‌సీన్‌.. ప్రియురాలిని ఇంప్రెస్‌ చేసేందుకు ప్రియుడు చేసిన పని..నెటిజన్లు సైతం ఫిదా

రద్దీగా ఉన్న విమానాశ్రయంలో ఓ యువకుడు తన ప్రియురాలికి బాలీవుడ్ స్టైల్‌లో ప్రపోజ్ చేయడం ఆమెను ఆశ్చర్యపరిచింది. దాంతో ఆమె సంతోషంలో తేలిపోయింది. వీరి ప్రేమ సీన్‌ నెటిజన్ల మనసు దోచుకుంది. రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ప్రేమ ప్రపోజల్, రొమాన్స్‌కి హద్దులు లేవని నిరూపిస్తుంది. ఒక బాలీవుడ్ సినిమాలోని సీన్ లాగా ఉందంటూ పలువురు కామెంట్‌ చేశారు.

Watch Viral Video: రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులో సూపర్‌ లవ్‌సీన్‌.. ప్రియురాలిని ఇంప్రెస్‌ చేసేందుకు ప్రియుడు చేసిన పని..నెటిజన్లు సైతం ఫిదా
Young Man Proposes
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2023 | 9:24 PM

Share

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని వీడియోలు ఒకసారి చూసిన తర్వాత మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఎయిర్‌పోర్ట్‌లో సినిమా స్టైల్‌లో ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు ఓ యువకుడు. దాంతో ఆ యువతి ఇంప్రెస్‌ అయిపోతుంది. చుట్టూ జనాలు చూస్తుండగానే అతడు మోకాళ్లపై కూర్చుని ఎంతో అందంగా తనకు ప్రపోజ్‌ చేయటం ఆమె ఫిదా అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను సైతం ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆక్లాండ్ విమానాశ్రయంలో జరిగింది ఈ అద్భుతమైన సీన్‌. విమానాశ్రయంలో ఓ భారతీయ యువకుడు తన ప్రియురాలికి బాలీవుడ్ స్టైల్‌లో ప్రపోజ్ చేయడం ఆమెను ఆశ్చర్యపరిచింది. దాంతో ఆమె సంతోషంలో తేలిపోయింది. వీరి ప్రేమ సీన్‌ నెటిజన్ల మనసు దోచుకుంది. రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ప్రేమ ప్రపోజల్, రొమాన్స్‌కి హద్దులు లేవని నిరూపిస్తుంది. ఒక బాలీవుడ్ సినిమాలోని సీన్ లాగా ఉందంటూ పలువురు కామెంట్‌ చేశారు. ఆక్లాండ్ విమానాశ్రయంలో యంగ్ యశ్ రాజ్ తన స్నేహితురాలు రియా శుక్లాను రద్దీగా ఉన్న విమానాశ్రయంలో ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచాడు.

ఇవి కూడా చదవండి

ఆ యువతికి తెలియకుండా.. ముందే వారి స్నేహితులు, కుటుంబ సభ్యులను ఎయిర్‌పోర్టు లోపలికి తీసుకొచ్చి.. అందరి ఎదురుగానే.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని నేరుగా యువతిని కోరాడు. పైగా చుట్టూ ఉన్న జనాల చేతుల్లో ప్లకార్డులు ఏర్పాటు చేశాడు..వాటిపై విల్‌ యూ మ్యారీ మీ అనే సందేశం ఉంది.. ఎయిర్‌పోర్టులో ఊహించని విధంగా అనౌన్స్‌ చేస్తూ.. తనను పెళ్లి చేసుకుంటావా అని అడగటంతో ఆ యువతి పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆ తర్వాత యువకుడు మోకాళ్లపై కూర్చొని ఉంగరంతో ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. దాంతో ఆమె కరిగిపోతుంది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఇలాంటి లవ్ స్టోరీలకే అందరూ పడిపోతుంటారు అంటూ పలువురు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!