అయ్య బాబోయ్‌ దెయ్యంరో…! పోస్టుమార్టం గదిలో నిచ్చెనపై ఎక్కి ఏం చేస్తుందంటే.. ధైర్యముంటేనే వీడియో చూడండి..

వెదురు నిచ్చెన మనిషిలా సాఫీగా నడుస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాకింగ్ నిచ్చెనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ చాలా మందిలో భయంతో వణికిపోయేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ వీడియో మాత్రం అందరినీ భయపెడుతూనే షేర్లు, లైకులు సంపాదిస్తోంది.

అయ్య బాబోయ్‌ దెయ్యంరో...!  పోస్టుమార్టం గదిలో నిచ్చెనపై ఎక్కి ఏం చేస్తుందంటే..  ధైర్యముంటేనే వీడియో చూడండి..
Bamboo Ladder
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 03, 2023 | 8:53 PM

పోస్ట్ మార్టం గదిలో స్వయంగా కదిలిన నిచ్చెన అందరినీ అదరగొట్టేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. షాకింగ్‌ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. యూపీలోని ఓ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం గదిలో వెదురు నిచ్చెన స్వయంగా కదులుతున్న వీడియో ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 6.88 లక్షల మందికి పైగా వీక్షించారు. సైన్స్, అదృశ్య శక్తుల మధ్య చర్చ ఇంకా కొనసాగుతోంది. ప్రతిదీ శాస్త్రీయంగా నిరూపించబడిన ఆధునిక యుగంలో మనం జీవిస్తున్నాము. అయినప్పటికీ, నేటికీ దెయ్యాలు, ఆత్మలను నమ్మే వారు కూడా ఉన్నారు. వైజ్ఞానిక ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, కొన్నిసార్లు సైన్స్ కూడా కొన్ని దృగ్విషయాలను వివరించడానికి కష్టపడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలోని పోస్ట్‌మార్టం గదిలో వెదురు నిచ్చెన స్వయంగా కదులుతున్న వీడియో ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వేలాది మంది వీక్షించారు. ఈ నిచ్చెన వీడియో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని ఎస్‌ఆర్‌ఎంఎస్ మెడికల్ కాలేజీ పోస్ట్‌మార్టం హౌస్‌లో రికార్డ్ అయినట్టుగా తెలిసింది. వెదురు నిచ్చెన మనిషిలా సాఫీగా నడుస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాకింగ్ నిచ్చెనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ చాలా మందిలో భయాన్ని సృష్టించగా, చాలా మందిలో అనేక సందేహాలను లేవనెత్తింది. నిచ్చెన కదలిక వెనుక కనిపించని శక్తి ఉందని నెటిజన్లు అనుమానించడంతో వైరల్ వీడియో విస్తృతంగా షేర్ చేయబడింది.

కదులుతున్నప్పుడు శబ్దం చేస్తున్న ఈ నిచ్చెనను చూస్తే ఎవరికైనా భయం కలగడం సహజం. ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 6.88 లక్షల మందికి పైగా వీక్షించారు. నిచ్చెన ఉన్న ప్రాంతం పల్లంగా ఉండటంతో ఆ నిచ్చెన దానంతట అదే ముందుకు కదులుతుంది తప్ప..ఇక్కడ ఎలాంటి మాయాజాలం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వీడియో మాత్రం అందరినీ భయపెడుతూనే షేర్లు, లైకులు సంపాదిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..