Telangana: ధూంధాం వార్త..! ఇకపై సర్కారు వారి మటన్ షాపులు… గవర్నమెంట్ బిర్యాని కూడా..

Telangana: మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, తో పాటు మాంసాన్ని కూడా ఈ క్యాంటీన్లో విక్రయించనున్నారు. బయట ప్రైవేట్ మార్కెట్ కంటే తక్కువ ధరలో ఇక్కడ మటన్ ఉత్పత్తులు లభిస్తాయి. దీంతోపాటు గొర్రెల పెంపకం దారులకు కూడా ఈ మటన్ క్యాంటీన్లకు అనుసంధానం చేసి నేరుగా ఉత్పత్తులు విక్రయించుకునేలా లింక్ చేయబోతున్నారు.

Telangana: ధూంధాం వార్త..!  ఇకపై సర్కారు వారి మటన్ షాపులు... గవర్నమెంట్ బిర్యాని కూడా..
Biryani Centres
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 03, 2023 | 6:27 PM

తెలంగాణ అంటేనే ధూంధాం దావతులకు ఫేమస్. ఇక నాన్ వెజ్ విషయంలో తెలంగాణలో వినియోగం చాలా ఎక్కువ. అందులోనూ మటన్ వినియోగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సండే వస్తే చాలు ప్రతి మటన్ షాప్ ముందు పెద్ద క్యూలైన్లు కనిపిస్తాయి. మరోవైపు ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకంపై దృష్టి పెట్టి లక్షల గొర్రెల యూనిట్లను ఉచితంగా పంచింది. గతంలో తెలంగాణకు మటన్ ఇంపోర్ట్ అయ్యేది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. అయితే ఇంత జరుగుతున్న మాంసం ధర మాత్రం రోజు రోజుకూ పెరుగుతుంది. మధ్యతరగతి జీవులకు మటన్ అందకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మటన్ క్యాంటీన్లను తెరిచేందుకు సిద్ధమైంది.

షిప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మటన్ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫిష్ క్యాంటీన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది మాసబ్ ట్యాంక్ లో ఉన్న ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మొదటగా మటన్ క్యాంటీన్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో, హైదరాబాదులో వివిధ ప్రాంతాల్లో తెలంగాణ మటన్ క్యాంటిన్లు ప్రారంభం కానున్నాయి. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, తో పాటు మాంసాన్ని కూడా ఈ క్యాంటీన్లో విక్రయించనున్నారు. బయట ప్రైవేట్ మార్కెట్ కంటే తక్కువ ధరలో ఇక్కడ మటన్ ఉత్పత్తులు లభిస్తాయి. దీంతోపాటు గొర్రెల పెంపకం దారులకు కూడా ఈ మటన్ క్యాంటీన్లకు అనుసంధానం చేసి నేరుగా ఉత్పత్తులు విక్రయించుకునేలా లింక్ చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌