Hyderabad: దారుణం.. ఇంట్లోకి చొరబడి అక్కాతమ్ముడిపై కత్తితో దాడి చేసిన నిందితుడు..
Hyderabad News: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో దారుణమైన ఘటన జరిగింది. ఒక ఇంట్లోకి చొరబడిన దుండగుడు హల్‌చల్ చేశాడు. ఇంట్లో ఉండగా.. సంగవీ, తన తమ్ముడు పృధ్వీని దుండగడు కత్తితో పొడవటం కలకలం రేపింది. బాధితురాలని హోమియోపతి వైద్యారాలిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గురైన బాధితుడు బీటెక్ చదువుతున్నాడని చెప్పారు. ఈ దాడిలో పృధ్వికి.. అతని అక్క సంగవీకి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ న్యూస్, సెప్టెంబర్ 3: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో దారుణమైన ఘటన జరిగింది. ఒక ఇంట్లోకి చొరబడిన దుండగుడు హల్‌చల్ చేశాడు. ఇంట్లో ఉండగా.. సంగవీ, తన తమ్ముడు పృధ్వీని దుండగడు కత్తితో పొడవటం కలకలం రేపింది. బాధితురాలని హోమియోపతి వైద్యారాలిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గురైన బాధితుడు బీటెక్ చదువుతున్నాడని చెప్పారు. ఈ దాడిలో పృధ్వికి.. అతని అక్క సంగవీకి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ పృధ్వీకి చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపింది. ప్రస్తతం అతని సోదరి ఆస్పత్రిలో చికిత్స పొందుతంది. అయితే అక్కా తమ్ముళ్లపై దాడికి దిగినటువంటి నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక అతడు రామంతపూర్ ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. సంఘవి మొహం చేతులపై ఆ నిందితుడు కత్తితో తీవ్రంగా గాయపరిచాడని పోలీసులు చెప్పారు.
అసలు ఈ దాడికి ప్రేమ వ్యవహారనే కారణమని తెలుస్తోంది. ముందుగా ఆ నిందితుడు సంఘవితో మాట్లాడదామని ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనికి వచ్చాడు. అయితే అదే సమయంలో ఇంట్లో అక్క సంఘవి, తమ్ముడు పృధ్వీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వారు మాట్లాడుతుండగానే నిందితుడు.. సంఘవిల మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. దీంతో ఇంద్రుడు సహనం కోల్పాయాడని.. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తితో సంఘవిపై దాడి చేశానడని.. విచక్షణారహితంగా ఆమెను పొడిచినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె తమ్ముడ్ని కూడా నిందితుడు కత్తితో దాడిచేసినట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితుడు నుంచి సంఘవి తప్పించుకుని కిందకి పరుగులు పెట్టింది. అయితే ఇది గమనించిన స్థానికులు కర్రలతో నిందుడ్ని పట్టుకునేందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే ఆ నిందితుడ్ని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత తీవ్ర గాయాలపాలైన అక్కా తమ్ముళ్లను కామినేని ఆస్పత్రికి తరలించారు. ఇక వారిపై దాడికి పాల్పడ్డ నిందితుడు రామంతపూర్‌కి చెందిన శివకుమార్‌గా గుర్తించారు. ఇతడికి ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన సంఘవితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2.45 PM గంటలకు సంఘవితో మాట్లాడటానికి ఆమె ఇంటికి శివకుమార్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం పూట జరిగిన ఈ దాడి ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.