AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Next Target: ఆదిత్య, చంద్రయాన్‌తో సత్తా చాటిన ఇస్రో.. నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా..

ISRO What Next: చంద్రుడిపై రష్యా, చైనా, అమెరికా దేశాలు ప్రయోగాలు చేసినా క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై మాత్రం చేయలేక పోయాయి.. భారత్ తో పాటు ప్రయత్నించిన రష్యా విఫలమైంది.. చంద్రయాన్ 3 సక్సెస్ కొట్టింది.. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది.. అవెంటనే సూర్యుడిపై పరిశోధన కోసం ఆదిత్య ఎల్ 1 ప్రయోగం కూడా సక్సెస్ అయ్యింది.. అయితే ఇస్రో నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటూ డిస్కషన్ జరుగుతోంది.. ఇస్రో ప్రయత్నాలు ఆ దేశగానే ఉన్నా అందరిలో మాత్రం ఇలాంటి చర్చే జరుగుతోంది..

ISRO Next Target: ఆదిత్య, చంద్రయాన్‌తో సత్తా చాటిన ఇస్రో.. నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా..
Isro
Ch Murali
| Edited By: Sanjay Kasula|

Updated on: Sep 03, 2023 | 10:47 AM

Share

అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా, రష్యా, చైనా, జపాన్ తో పోల్చితే భారత్ అనుభవం చాలా తక్కువ.. అయితే ఇప్పుడు ఇస్రో వరుస విజయాలతో ఆ దేశాల సరసన నిలుస్తోంది.. ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాల కోసం రష్యాపై ఆధారపడి ఇస్రో ప్రయోగాలు చేసేది.. ఒకానొక సందర్భంలో రాకెట్ ప్రయోగాల్లో కీలకమైన క్రయోజనిక్ ఇంజన్ ఇస్తామని రష్యా తర్వాత మాట మార్చింది.. అలాంటి పరిస్థితి నుంచి సొంతంగా ఇంజన్ తయారు చేసుకుని లాంచ్ సక్సెస్ రేట్ వంద శాతానికి చేరుకున్నాం..

చంద్రుడిపై రష్యా, చైనా, అమెరికా దేశాలు ప్రయోగాలు చేసినా క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై మాత్రం చేయలేక పోయాయి.. భారత్ తో పాటు ప్రయత్నించిన రష్యా విఫలమైంది.. చంద్రయాన్ 3 సక్సెస్ కొట్టింది.. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది.. అవెంటనే సూర్యుడిపై పరిశోధన కోసం ఆదిత్య ఎల్ 1 ప్రయోగం కూడా సక్సెస్ అయ్యింది.. అయితే ఇస్రో నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటూ డిస్కషన్ జరుగుతోంది.. ఇస్రో ప్రయత్నాలు ఆ దేశగానే ఉన్నా అందరిలో మాత్రం ఇలాంటి చర్చే జరుగుతోంది..

ఇస్రో తర్వాత ప్రయోగం ఇవే..

ఎక్స్ పో సాట్ ఏం చేస్తుంది..

ఖగోళంలో అంతుచిక్కని అనేక విషయాలు ఎన్నో ఉన్నాయి.. ఇప్పటికే నాసా లాంటి అంతరిక్ష ప్రయోగ సంస్థలు అనేక విషయాలను తమ పరిశోధనల్లో తెలుసుకున్నారు.. అయితే ఇంకా సమాధానాలు లేని ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.. ఖగోళ పరిశోధనల్లో కూడా ఇస్రో కాలు మోపేందుకు సిద్ధమైంది.. ఇందుకోసం త్వరలోనే కీలక ప్రయోగానికి సిద్ధమైంది.. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో రెండు పరిశోధనా పరికరాలు ఉంటాయి.. దాదాపు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.. ఇక తేదీ మాత్రమే ప్రకటించాల్సి ఉంది.

గగన్ యాన్ స్పీడప్

భారత్ తొలి మ్యాన్ మిషన్ గగన్ యాన్.. అనుకున్న సమయానికి కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమైనా ఇప్పుడు ప్రయోగాల స్పీడ్ పెంచింది ఇస్రో. 2024 ఆరంభంలో గగన్ యాన్ ప్రయోగం శ్రీహరికోట నుంచి జరగనుంది.. అందుకోసం ఇప్పటికే నాలుగు దశల్లో ఎక్సపరిమెంట్స్ కూడా చేపట్టింది. ఇక వచ్చే నెలలో మరో ప్రయోగాత్మక ప్రయోగం జరపనున్నట్లు ఇస్రో చైర్మన్ ప్రకటించారు..

తర్వాత టార్గెట్ శుక్రయాన్

చంద్రయాన్, మంగళ్యాన్, గగన్ యాన్, తర్వాత శుక్రయాన్.. అవును ఇస్రో తర్వాత చేయనున్న కీలకమైన ప్రయోగం శుక్రయాన్.. శుక్ర గ్రహం లో అంతు చిక్కని రహస్యాల కోసం పర్సయోగం చేయనుంది ఇస్రో.. 2024 లోనే ఈ ప్రయోగాన్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. శుక్రుడి ఉపరితలంపై సల్ఫఅరన్క్ ఆమ్లాలు, ఉపరితలాన్ని ఆవరించి ఉన్న ఆమ్ల మేఘాల పై పరిశోధన చేయనుంది ఇస్రో. ఇందుకోసం చంద్రాయన్ 3 తరహాలోనే ల్యాండర్, రోవర్ కూడా స్పేస్ క్రాఫ్ట్ లో ఉండనున్నాయి.. మొత్తానికి ఇస్రో వరుస ప్రయోగాల తో పాటు క్లిష్టమైన ప్రయోగాలతో భారత్ సత్తా చాటుతోంది ఇస్రో.

మరిన్ని జాతీయ వార్తల కోసం