Old Liquor Sharab Policy: కొత్త సీసాలో పాత మద్యం.. ఆ ప్రభుత్వానికి భారీగా ఆదాయం
ఇంతకు ముందు కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు 2021-22లో ప్రభుత్వ ఆదాయం రూ.5,487.58 కోట్లు. కొత్త విధానంలో మద్యం రిటైల్ అమ్మకానికి ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే, తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా సూచన మేరకు సీబీఐ అక్రమాలపై విచారణ చేపట్టింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు. దీనిపై కూడా కొన్ని రోజులు రచ్చ కొనసాగింది..
కొత్త సీసాలో ‘ఓల్డ్ వైన్’… అవును, ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ గత ఏడాది లెక్కలు పూర్తి చేస్తే ఈ ప్రకటన సరిగ్గా సరిపోతుంది. గత సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని మద్యం మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా, దానిపై చాలా రాజకీయ ప్రకంపనలు కూడా భారీగానే వచ్చాయి. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబరు 1, 2022 నుంచి ‘పాత మద్యం విధానాన్ని’ అమలు చేసింది. ఇప్పుడు దీని కారణంగా ఆదాయాలు, అమ్మకాలలో ‘కొత్త రికార్డు’ సృష్టించింది. ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2022, ఆగస్టు 31, 2023 మధ్య 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించింది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలు, కాంట్రాక్టుల విక్రయాల్లోనూ ఇదే సరికొత్త రికార్డు.
బలమైన ఆదాయాలు, పెద్ద పన్ను వసూళ్లు
ఢిల్లీ ప్రభుత్వం కేవలం మద్యం విక్రయాల్లో రికార్డు సృష్టించిందనే చెప్పాలి. మద్యం అమ్మకాల ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి ఏడాదిలో రూ.7,285.15 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిపై ప్రభుత్వం వాల్యూ యాడెడ్ టాక్స్ అంటే వ్యాట్ వసూళ్లు కూడా రూ.2,013.44 కోట్లు.
ఇంతకు ముందు కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు 2021-22లో ప్రభుత్వ ఆదాయం రూ.5,487.58 కోట్లు. కొత్త విధానంలో మద్యం రిటైల్ అమ్మకానికి ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే, తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా సూచన మేరకు సీబీఐ అక్రమాలపై విచారణ చేపట్టింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు. దీనిపై కూడా కొన్ని రోజులు రచ్చ కొనసాగింది.
కొత్త ఎక్సైజ్ పాలసీపై దుమారం రేగడంతో ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. ఆ తర్వాత మద్యం దుకాణాలు, కాంట్రాక్టుల నిర్వహణ బాధ్యత ను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన 4 పీఎస్‌యూ లకు అప్పగించారు. ఇప్పుడు ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఢిల్లీ కన్స్యూమర్ కో- ఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్, ఢిల్లీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నగరంలో 600 మద్యం దుకాణాలను నడుపుతున్నాయి. అయితే ఢిల్లీ సర్కార్ మళ్లీ పాత మద్యం పాలసీని అమలు లోకి తీసుకురావడంతో భారీ స్థాయిలోనే ఆదాయం వచ్చి చేరినట్లయ్యిందనే చెప్పాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి