Home Loan: మీరు హోమ్‌ లోన్‌ను వేరే బ్యాంకుకు బదిలీ చేసుకోవాలనుకుంటున్నారా? చాలా సులభం

కొందరు అప్పు చేసి ఇల్లు కట్టుకోవడం లేదా ఫ్లాట్ కొనుక్కోవడం చేస్తారు. సొంతింటి కోసం బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం సహజం. అయితే ఒక్కోసారి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న తరువాత మనం లోన్ తీసుకున్న బ్యాంకు కంటే తక్కువ ఇంట్రస్ట్ తో లోన్ ఇచ్చే బ్యాంకు తారసపదవచ్చు. అంటే వడ్డీ రెట్లు తగ్గాయని చెప్పి మరొక బ్యాంకు తక్కువ రేటుకు హోమ్ లోన్ ఇస్తామని చెప్పవచ్చు. అటువంటి..

Home Loan: మీరు హోమ్‌ లోన్‌ను వేరే బ్యాంకుకు బదిలీ చేసుకోవాలనుకుంటున్నారా? చాలా సులభం
Home Loan Transfer
Follow us
Subhash Goud

|

Updated on: Sep 02, 2023 | 6:51 PM

ప్రస్తుత కష్టకాలంలో సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కష్టపడి కొంత డబ్బు పోగేసి.. దానికి అదనంగా కొంత అప్పు చేసి ఇల్లు కట్టుకోవడం లేదా ఫ్లాట్ కొనుక్కోవడం చేస్తారు. సొంతింటి కోసం బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం సహజం. అయితే ఒక్కోసారి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న తరువాత మనం లోన్ తీసుకున్న బ్యాంకు కంటే తక్కువ ఇంట్రస్ట్ తో లోన్ ఇచ్చే బ్యాంకు తారసపదవచ్చు. అంటే వడ్డీ రెట్లు తగ్గాయని చెప్పి మరొక బ్యాంకు తక్కువ రేటుకు హోమ్ లోన్ ఇస్తామని చెప్పవచ్చు. అటువంటి పరిస్థితిలో మనం లోన్ తీసుకున్న బ్యాంక్ నుంచి వేరే బ్యాంకుకు మన లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనివలన మన ఈఎంఐ తగ్గుతుంది. అలానే నెలవారీ మన ఆదాయంలో తక్కువ భాగం లోన్ రీ పేమెంట్ కోసం వెళుతుంది. హోమ్ లోన్ ట్రాన్స్ ఫర్ చేసుకోవడం గురించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  1. తక్కువ వడ్డీ: ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ కు హోమ్ లోన్ బదిలీ చేసుకోవడానికి ప్రధాన కారణం రెండో బ్యాంకులో తక్కువ వడ్డీ రేటుకు లోన్ దొరకడమే. అంతేకాదు.. ఇలా లోన్ ఈఎంఐ తగ్గడం వలన ఆర్థికంగా ప్రతినెల కాస్త వెసులుబాటు దొరుకుతుంది.
  2. మినిమం డాక్యుమెంటేషన్: ప్రస్తుతం మన దేశంలోని అత్యుత్తమ బ్యాంకులు ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేకుండా గృహ లోన్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్‌ అందిస్తాయి. అనేక సందర్భాల్లో ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ద్వారా రుణాన్ని కొత్త బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. ఇందులో మినిమం డాక్యుమెంటేషన్ ఉంటుంది. లోన్ బదిలీ అభ్యర్థన ఆమోదిస్తారు. లోన్ ప్రాసెస్ కు ఎక్కువ సమయం పట్టదు. లోన్ డాక్యుమెంట్స్ మొదటి లోన్ తీసుకున్న బ్యాంకు నుంచి కొత్తదానికి బదిలీ అవుతాయి.
  3. డబ్బు ఆదా: వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ కోసం నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండవచ్చు. అందుకే కస్టమర్ దీర్ఘకాలంలో ఎక్కువ డబ్బు ఆదా చేయడం జరుగుతుంది. ఈ సేవింగ్స్ లోన్ వేగంగా తిరిగి చెల్లించడానికి లేదా మరొక చోట ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు.
  4. మీ క్రెడిట్ స్కోర్‌లో ఎటువంటి మార్పు ఉండదు: బ్యాంకుల మధ్య రుణ బదిలీ కస్టమర్ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. నిజానికి ఇది లోన్ ప్రాసెస్‌లో అంతర్లీనంగా ఉండే ఏ అంశాలను ప్రభావితం చేయదు. అయితే కొత్త బ్యాంక్ లోన్‌ను తమకు బదిలీ చేయడానికి విధించే ప్రాసెసింగ్ ఫీజులను మీరు తెలుసుకోవాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎప్పటిలానే పేమెంట్స్: మీరు ఇంతకుముందు బ్యాంక్‌తో ఇప్పటి వరకు చేస్తున్న లోన్ రీపెమేంట్ విధానమే కొనసాగించవచ్చు. లోన్ బదిలీ మీ రీపేమెంట్ ప్రవర్తన- రేటుపై కూడా ప్రభావం చూపదు. మీరు కావాలనుకుంటే మీరు లోన్ ని ముందస్తుగా కూడా చెల్లించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి