UPI Transaction: ఆగస్ట్‌లో రికార్డ్ స్థాయిలో డిజిటల్ లావాదేవీలు.. యూపీఐ సాధించిన విజయాలపై మోడీ స్పందన
గత నెల అంటే జూలైతో పోలిస్తే యూపీఐ లావాదేవీలు కొద్దిగా పెరిగాయి. జూలై 2023 నెలలో, 996 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 15.34 లక్షల కోట్ల నగదు మార్పిడి జరిగింది. ఇంకా జూన్ 2023 నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య 934 కోట్లు కాగా, డబ్బు మొత్తం రూ. 14.75 లక్షల కోట్లు. దీనికి సంబంధించి ఎన్‌పీసీఐ తన ఖాతాలోని సమాచారాన్ని గ్రాఫిక్స్ ఇమేజ్‌తో అప్‌డేట్ చేసింది. ఎన్‌పీసీఐ ట్వీట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ..
భారత్‌లో యూపీఐ వ్యవస్థ రోజురోజుకూ బలపడుతోంది. యూపీఐ ద్వారా ఎక్కువ డబ్బు లావాదేవీలు జరుగుతాయి. యూపీఐ ద్వారా నగదు లావాదేవీల సంఖ్య, మొత్తం రెండూ కూడా ఆగస్టు నెలలో గణనీయంగా పెరిగాయి. యూపీఐని అభివృద్ధి చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆగస్టు 2023 నెలలో యూపీఐని ఉపయోగించి సరిగ్గా 1058 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య శాతం పెరిగింది. 61 శాతం పెరిగింది. ఇక ఆగస్టు నెలలో మొత్తం లావాదేవీల మొత్తం రూ.15.76 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది కూడా 47 శాతం పెరిగింది.
గత నెల అంటే జూలైతో పోలిస్తే యూపీఐ లావాదేవీలు కొద్దిగా పెరిగాయి. జూలై 2023 నెలలో, 996 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 15.34 లక్షల కోట్ల నగదు మార్పిడి జరిగింది. ఇంకా జూన్ 2023 నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య 934 కోట్లు కాగా, డబ్బు మొత్తం రూ. 14.75 లక్షల కోట్లు. దీనికి సంబంధించి ఎన్‌పీసీఐ తన ఖాతాలోని సమాచారాన్ని గ్రాఫిక్స్ ఇమేజ్‌తో అప్‌డేట్ చేసింది. ఎన్‌పీసీఐ ట్వీట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా స్పందించారు. డిజిటల్ పురోగతిని స్వీకరించే ప్రయత్నానికి ఇది అద్దం పడుతుందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
It's 10 Billion+ transactions in August`23! Make seamless payments from your mobile in real-time with UPI.#UPI #DigitalPayments #UPIChalega @GoI_MeitY @_DigitalIndia @upichalega @dilipasbe pic.twitter.com/5NrcpIirn8
— NPCI (@NPCI_NPCI) September 1, 2023
ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ద్వారా UPI సృష్టించబడింది. ఇది కోవిడ్‌కు ముందు అమలు చేసినప్పటికీ కోవిడ్ సమయంలో దీని వినియోగం గణనీయంగా పెరిగింది. లాక్‌డౌన్ కారణంగా, నగదు లావాదేవీలు కష్టంగా మారాయి. ప్రజలు యూపీఐని ఉపయోగించడం దాదాపు అనివార్యమైంది.
This is exceptional news! It is a testament to the people of India embracing digital progress and a tribute to their skills. May this trend continue in the times to come. https://t.co/MrXpYbg5Cd
— Narendra Modi (@narendramodi) September 1, 2023
ఇంతలో భారతదేశం సూపర్ హిట్ యూపీఐ సిస్టమ్ అనేక దేశాల దృష్టిని ఆకర్షించింది. అధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్న దేశాల్లో యూపీఐ సిస్టమ్‌ను ఉపయోగించడానికి అనుమతించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూపీఐ సహకార చెల్లింపు వ్యవస్థ సింగపూర్, యూఏఈలో వాడుకలో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి