Digital Payments: పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ అలవాటు చేస్తున్నారా? లేదా?
పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ విషయంలోనూ డిజిటల్ విధానం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలకు పాకెట్ మనీ ఇచ్చినా చాలా పేమెంట్స్ కోసం వారు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం సర్వసాధారణం అయిపొయింది. కొన్ని చోట్ల క్యాష్ పేమెంట్ చేసే పరిస్థితి లేకపోవడం.. ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయాలంటే డిజిటల్ పేమెంట్ విధానమే తప్పనిసరి కావడం పిల్లలకు కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు పిల్లల్లో డిజిటల్‌గా డబ్బు ఖర్చు చేయడం.. పొదుపు చేయడం అలవాటు..
మన దేశంలో పేమెంట్స్ విధానం చాలా విప్లవాత్మకంగా మారిపోయింది. ఇప్పుడు దాదాపుగా డబ్బును జేబులో లేదా పర్స్‌లో పెట్టుకుని తిరిగే వారు ఎవరూ లేరంటే అది అతిశయోక్తి కాదు. డిజిటల్ పేమెంట్ విధానంలో కూరగాయల నుంచి కూలర్ల వరకూ కొనుక్కునే పరిస్థితి. చిల్లర లేదనే బాధ లేదు. డబ్బు పోతుందనే భయం లేదు. పర్స్ కొట్టేస్తారనే చింతా లేదు. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటె చాలు పేమెంట్ అయిపోతుంది. డెబిట్ కార్డ్ వినియోగం కూడా బాగా తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ విషయంలోనూ డిజిటల్ విధానం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలకు పాకెట్ మనీ ఇచ్చినా చాలా పేమెంట్స్ కోసం వారు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం సర్వసాధారణం అయిపొయింది. కొన్ని చోట్ల క్యాష్ పేమెంట్ చేసే పరిస్థితి లేకపోవడం.. ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయాలంటే డిజిటల్ పేమెంట్ విధానమే తప్పనిసరి కావడం పిల్లలకు కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు పిల్లల్లో డిజిటల్‌గా డబ్బు ఖర్చు చేయడం.. పొదుపు చేయడం అలవాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
పిల్లలకు డెబిట్ కార్డ్.. డిజిటల్ వాలేట్లను పరిచయం చేయాలి. వీటిని వారు ఉపయోగించడం వలన కొన్ని ఇబ్బందులు ఉండే మాట వాస్తవం కానీ.. అవగాహన పెంచితే వారు దీనిని జాగ్రత్తగా ఉపయోగించగలరు. ఎందుకంటే పిల్లలు టెక్నాలజీ నేర్చుకోవడం పెద్దల కంటే చాలా ముందుంటారు. డిజిటల్ పేమెంట్స్ గురించి పిల్లలకు ఎలా నేర్పించాలి అనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
డెబిట్ కార్డ్ ద్వారా అలాగే డిజిటల్ గా పేమెంట్ చేయాలంటే ముందుగా డబ్బు అందులోకి ఎలా వస్తుంది అనే విషయాన్ని వారికి అర్ధం అయ్యేలా చెప్పాలి. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది వివరించాలి. డబ్బు ఉంది కదా అని కనబడిన వస్తువు కొనేసే అలవాటు కాకుండా చూసుకోవాలి. వారికి డెబిట్ కార్డ్ లో కొంత మొత్తం ఏర్పాటు చేసి.. దానిని బడ్జెట్ చేసుకోమని చెప్పాలి. ఉదాహరణకు 1000 రూపాయలు ఒకటో తేదీన వారి అకౌంట్ లో క్రెడిట్ చేయాలి. దానిని ఎలా ఖర్చు పెడతారు అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పమనండి. మీ పిల్లల నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయమని అడగండి. ఉదాహరణకు, మీరు వారికి నోట్‌ప్యాడ్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు, అక్కడ వారు వారి నెలవారీ ఖర్చులన్నింటినీ నోట్ చేసుకోవచ్చు. ఆ వెయ్యిరూపాయలు బడ్జెట్ లో ఏదైనా మార్పులు సూచించాలి అనుకుంటే సూచించండి. ఇప్పుడు వారు దాని ప్రకారం ఖర్చు చేస్తున్నారా? లేదా అనే దానిని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు వారి ఖర్చులన్నిటికీ సరిపడా డబ్బు కూడా వారి అకౌంట్ లో ఉంచవచ్చు. దానిని వారినే ఖర్చు చేయమని చెప్పవచ్చు.
దీనివలన రూపాయి రూపాయి ఎలా ఖర్చు అవుతుంది అనే విషయం వారికీ అవగాహన వస్తుంది. తనకు ఎంత ఖర్చు అవుతుంది అనే స్పష్టత వారికీ ఉంటుంది. నెల చివరలో పిల్లలతో కూచుని చర్చించండి. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేశారు? దానిని ఎలా అదుపు చేసుకోవచ్చు వివరించండి. వారి ఖర్చుల్లో ఉపయోగం లేనివి ఏమిటి? అనే విషయాన్ని వారికీ అర్ధం అయ్యేలా చెప్పండి. బడ్జెట్ లో డబ్బు మిగుల్చుకుని వాటిని ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించండి. నెలకు వందరూపాయలు ఏదైనా సేవింగ్స్ స్కీం లో పెడితే సంవత్సరం చివర ఎంత వస్తుందో చెప్పండి. అనవసర ఖర్చులు చేయకుండా డబ్బు దాచుకుంటే అది మరికొంత డబ్బును ఇస్తుంది అనే విషయం వారికీ అర్ధం అవుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ వంటి సాధారణ సేవింగ్స్ విధానాలను వారికి పరిచయం చేయండి, అలాగే ఈ డబ్బు-పొదుపు పరిష్కారాలు భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని సమీకరించడంలో ఎలా సహాయపడతాయో వారికి వివరిస్తుంది.
ఇదంతా ఒక్కరోజులోనో.. నెలలోనూ సవ్యంగా పూర్తికాదు. అలాగే, పిల్లలు కూడా కచ్చితంగా మీరు అనుకున్నట్టే చేస్తారనీ లేదు. క్రమేపీ అలవాటు అవుతుంది. మీరు ఎప్పుడైతే డెబిట్ కార్డ్ వారికీ ఇచ్చారో.. అప్పుడే ఆర్థిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. మీరు వారికి డెబిట్ కార్డ్ ఇచ్చినప్పుడు, డబ్బు అనే విలువైన వనరును జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను వారికి ఇస్తున్నందున మీరు వారి మెచ్యూరిటీని కూడా అంగీకరిస్తున్నారని వారికీ తెలుస్తుంది.
సాధనతో పొదుపు అలవాటు వస్తుంది. మీ పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ ప్రాథమికాలను నేర్పించడం తొందరపాటు అని అనుకోవద్దు. చిన్న పిల్లలు వారికేం తెలుస్తుంది అనే అపప్రధ వదిలేయండి. వారికే అన్నివిషయాలు బాగా అర్ధం అవుతాయి. చెప్పేలా చెబితే.. వారినే చేసేలా ప్రోత్సహిస్తే అనే విషయాన్ని గుర్తించండి.
ఒక్కమాటలో చెప్పాలంటే, సంపద సృష్టికి పొదుపు మూలస్తంభం. ఇది విపరీతమైన ఖర్చులను తొలగిస్తుంది, తద్వారా మరింత క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లను కలిగి ఉంటుంది. కాబట్టి, మీ పిల్లలు చిన్న వయస్సులోనే ఆర్థిక నిర్వహణను తెలుసుకోవడం వారు ఆర్థికంగా బాధ్యతాయుతంగా – స్వతంత్ర పెద్దలుగా ఎదగడంలో మీరు సహాయపడండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి