Gold Price: నెలంతా దోబూచులాట.. చివరికి అటూ ఇటూగా అక్కడే.. ఆగస్టులో బంగారం ధరలు!
ఆగస్ట్ 21 తేదీకి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 54,150, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59,070 కి చేరుకున్నాయి. మళ్ళీ మూడు రోజుల పాటు నిలకడగా ఉన్న బంగారం 28వ తేదీన కాస్త తగ్గింది. ఆగస్ట్ 29 తేదీ నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ చివరకు 31వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,150, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.60,160 వద్ద నిలిచింది..
Updated on: Aug 31, 2023 | 9:26 PM

ఆగస్టు నెలలో బంగారం ధరలు పైకీ.. కిందికీ.. మదుపర్లకు కదులుతూ స్థిరం లేకుండా చేశాయి. చివరకు ఒకటో తేదీ ధరకు కొంచెం తక్కువలో నెల ప్రయాణం ముగించాయి. ఆగస్టు 1న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,400, అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.60,440 దగ్గర ప్రారంభం అయ్యాయి.

ఆగస్ట్ 3 నాటికి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 54,950, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59,950 కి పడిపోయాయి. రెండు రోజుల పాటు ఇలానే ఉన్న బంగారం ధరలు 5వ తేదీ పైకెగశాయి. ఆగస్ట్ 5 నుంచి 8 వరకూ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,150, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.60,160 గా నిలకడగా ఉన్నాయి.

ఆగస్ట్ 9 వ తేదీన భారీగా పతనం అయ్యాయి. బంగారం ధరలు అక్కడ నుంచి 12 వతేదీ వరకూ స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. అయితే ఆగస్ట్ 12 తేదీకి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 54,650, అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59,620 కి చేరుకున్నాయి. అక్కడ నుంచి రెండురోజులు నిలకడగా ఉన్న బంగారం ధరలు 15 తేదీ నుంచి 17వ తేదీ వరకూ కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చాయి.

Gold Price Today

ఆగస్ట్ 21 తేదీకి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 54,150, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59,070 కి చేరుకున్నాయి. మళ్ళీ మూడు రోజుల పాటు నిలకడగా ఉన్న బంగారం 28వ తేదీన కాస్త తగ్గింది. ఆగస్ట్ 29 తేదీ నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ చివరకు 31వ తేదీన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,150, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.60,160 వద్ద నిలిచింది.





























