Royal Enfield e-Bike: దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ ‘బుల్లెట్’.. లాంచింగ్ ఎప్పుడంటే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రెండీ బైక్. యువత ఎక్కువగా ఇష్టపడే టూ వీలర్. డుగ్గు డుగ్గుమని అది చేసే సౌండుకే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అటువంటి బైక్ ఎలక్ట్రిక్ వేరియంట్లో అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించిన ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అన్నీ కుదిరితే 2025నాటికి ఎలక్ట్రిక్ బుల్లెట్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Royal Enfield e-Bike: దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ ‘బుల్లెట్’.. లాంచింగ్ ఎప్పుడంటే..
Royal Enfield
Follow us
Madhu

|

Updated on: Sep 01, 2023 | 2:34 PM

రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రెండీ బైక్. యువత ఎక్కువగా ఇష్టపడే టూ వీలర్. డుగ్గు డుగ్గుమని అది చేసే సౌండుకే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అటువంటి బైక్ ఎలక్ట్రిక్ వేరియంట్లో అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించిన ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అన్నీ కుదిరితే 2025నాటికి ఎలక్ట్రిక్ బుల్లెట్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్  బండి తయారీ, లాంచింగ్, ప్రస్తుత పరిస్థితిపై ఐచర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ లాల్ మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

వినియోగదారుల అంచనాలకు మించి..

ఐచర్ మోటర్స్ లో భాగమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ వేరియంట్ 2025లో మార్కెట్లోకి రానుంది. ఈ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని ఐచర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ లాల్ తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ మోడల్ బుల్లెట్ వాహనం అభివృద్ధి వివిధ దశల్లో కొనసాగుతోందన్నారు. తమ ప్రణాళిక ప్రకారం 2025 నాటికి బండిని అందుబాటులో తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తమకు ఇంకా 24 నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి లోటుపాట్లను అధ్యయనం చేసి, ఒక విజయవంతమైన మోడల్గా దీనిని ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారుల అంచనాకు మించి బైక్ పనితీరుతో పాటు దానిలో ఫీచర్లు ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. అందుకోసం తాము శక్తిశంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

సంస్థ లక్ష్యం ఇదే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ డీఎన్ఏతో విభిన్నమైన, అధిక-పనితీరు, సులభంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను రూపొందించడం లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని సిద్ధార్థ చెప్పారు. ఇప్పటికే ఈవీ రంగంలో అధిక పెట్టుబడులు పెట్టడానికి ఈ ఐచర్ సంస్థ సిద్ధమైందన్నారు. అలాగే ఈవీ బిజినెస్ లో ప్రత్యేకంగా నిలబడేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. అందుకోసం ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసిందని.. దీనిలో 100 మంది సభ్యులు ఉంటారని వివరించారు ఇంతకు ముందు డుకాటితో కలిసి చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా పనిచేసిన మారియో అల్విసి ఈ బృందంలో ఉన్నారని పేర్కొన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌నే కాకుండా సమగ్ర ఈవీ వ్యాపారాన్ని నిర్మించడంపై దృష్టి సారించిందని చెప్పారు. ఈ క్రమంలో స్పానిష్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ అయిన స్టార్క్ ఫ్యూచర్‌లో ఐషర్ మోటార్స్ వ్యూహాత్మక పెట్టుబడి పెట్టిందన్నారు. రెండు కంపెనీలు ఒకరి సాయంతో ఒకరు అభివృద్ధి సాధించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్ నేషనల్ మార్కెట్ పై ఫోకస్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్‌లో బలమైన మార్కెట్ వాటాను కొనసాగిస్తూనే.. అంతర్జాతీయ మార్కెట్‌లపైనా ఫోకస్ పెట్టిందని సిద్ధార్థ్ లాల్ వివరించారు. బైక్ సెగ్మెంట్ (250-750సీసీ)లో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో అధిక వాటాను కలిగి ఉండేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు. అందుకోసం అవసరమైన వ్యూహాలను, ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను కూడా అధిగమించేందుకు సన్నద్ధమయ్యామని లాల్ చెప్పొకొచ్చారు. ఎందుకంటే కొన్ని గ్లోబల్ మార్కెట్లలో మిడిల్ వెయిట్ బైక్‌లను మార్కెట్ చేయడం అంత సులభం కాదని వివరించారు.

బ్యాటరీ తప్ప అన్ని సొంతంగానే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్స్ సీఈఓ బి. గోవిందరాజన్ మాట్లాడుతూ, కంపెనీ ఇప్పటికీ బ్యాటరీ వంటి కొన్ని భాగాలను మాత్రమే దిగుమతి చేసుకుంటుదని చెప్పారు. మిగిలిన ప్రధాన భాగాలు కంపెనీ సొంతంగా తయారు చేస్తుందని పేర్కొన్నారు. తాము ఇప్పటికే 11-12 కొత్త సరఫరాదారులను చేర్చుకున్నామని, ఇంకా మరికొన్ని ప్రపోజల్స్ ను చూస్తున్నామని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి