RBI: 93 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి: ఆర్బీఐ
ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. 2000 రూపాయలు డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మే 19, 2023న చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది..

2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలని, ఇందు కోసం ఈ నోట్లు కలిగి ఉన్న వారు బ్యాంకులో మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఈ కరెన్సీని చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలుపడంతో మే 19న చెలామణిలో ఉన్న రూ.2000 కరెన్సీ నోట్లలో 93 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. బ్యాంకుల నుంచి అందిన డేటా ప్రకారం.. ఆగస్టు 31, 2023 వరకు చెలామణి నుంచి తిరిగి పొందిన రూ. 2000 నోట్ల మొత్తం విలువ 3.32 లక్షల కోట్ల రూపాయలు అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా వెల్లడించింది.
ఆగస్టు 31, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లు రూ.0.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ విధంగా మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 93 శాతం తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.
ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. 2000 రూపాయలు డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మే 19, 2023న చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
మార్చి 31, 2023న 3.62 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని ఆర్బీఐ నివేధించింది. మే 19వ తేదీన బ్యాంకింగ్ సమయం ముగిసే వరకు 3.56 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిందని తెలిపింది.
అధిక విలువ కలిగిన 2000 రూపాయల నోటు సెప్టెంబరు 30, 2023 వరకు డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మిగిలిన కాలాన్ని ఉపయోగించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థించింది. అయితే ఈ 2000 రూపాయల నోట్లను మార్చుకోవాలంటే ఐడీ ఫ్రూప్ గానీ, ఇతర స్లిప్‌లు అవసరం లేదని ఆర్బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. మీ సమీపంలో ఉన్న బ్యాంకును సందర్శించి సులభంగా నోట్లను మార్చుకోవాలని లేదా మీ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు కూడా ఎలాంటి ఐడీ రుజువు లేకుండా ఏదైనా బ్రాంచ్‌కు వెళ్లి నోట్లను మార్చుకోవచ్చని చెబుతోంది. ఒక వ్యక్తి రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ఓకేసారి రూ.20 వేల వరకు పరిమితి ఉందని ఆర్బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు 16 రోజుల పాటు సెలవులు వచ్చాయి. అందుకు వినియోగదారులు గడువు తేదీ చూడకుండా ముందస్తుగానే బ్యాంకులకు వెళ్లి మార్చుకోవడం బెటర్. లేకపోతే చివరి నిమిషంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి