Gold Price Today: హమ్మయ్యా గోల్డ్ లవర్స్‌కి ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధర. ఎంతంటే..
డాలర్ విలు పుంజుకున్న నేపథ్యంలో బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. సహజంగానే డాలర్ విలువ పెరిగే సమయంలో బంగారం ధరలు తగ్గుతాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా రూ. 110 వరకు తగ్గడం విశేషం...
వరుసగా రెండు రోజులు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా శనివారం తగ్గుముఖం పట్టాయి. డాలర్ విలు పుంజుకున్న నేపథ్యంలో బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. సహజంగానే డాలర్ విలువ పెరిగే సమయంలో బంగారం ధరలు తగ్గుతాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా రూ. 110 వరకు తగ్గడం విశేషం. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,200, 24 క్యారెట్స్ ధర రూ. 60,200గా ఉంది.
* ముంబయిలో 22 క్యారెట్స్ రూ. 55,050 , 24 క్యారెట్స్ రూ. 60,050 ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,050, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్స్ బంగారం రూ. 55,350, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,390గా ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.బ55,050 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,050 గా ఉంది.
* వరంగల్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,050, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో 22 క్యారెట్స్ రూ. 55,050, 24 క్యారెట్స్ ధర రూ. 60,050గా ఉంది.
* ఇక విజయవాడలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,050 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,050 గా నమోదైంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర శనివారం రూ. 77,100 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 77,100, చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,200, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 80,200 గా ఉండగా విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,200 వద్ద కొనసాగుతోంది.
గమనిక: పైన పేర్కొన్న ధరలు బులియన్ మార్కెట్‌లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు ఓసారి ప్రస్తుత ధర ఎంత ఉందో చూసుకుంటే మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..