Rs.2000 Notes: ఇంకా రూ. 2 వేల నోట్లను మార్చుకోలేదా..? త్వరపడండి, గడువు తేదీ దగ్గర పడుతోంది.. ఎలా మార్చుకోవాలంటే..?

Rs.2000 Notes Exchange: ఇంకా రూ. 2 వేల నోట్లను మార్చుకోనివారు వెంటనే మీ సమీప బ్యాంకులకు వెళ్లి మార్చుకోండి. లేదంటే తర్వాత చింతించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెలలో ఏకంగా 16 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. మరోవైపు నోట్ల మార్పిడి గడువు తేదీని పెంచేది లేదని కేంద్రం ఖరాఖండీగా చెప్పేసింది. ఈ క్రమంలో మీరు రూ. 2000 నోట్లను మార్చుకోవడం లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ కోసం బ్యాంక్ ఖాతా తప్పనిసరి..

Rs.2000 Notes: ఇంకా రూ. 2 వేల నోట్లను మార్చుకోలేదా..? త్వరపడండి, గడువు తేదీ దగ్గర పడుతోంది.. ఎలా మార్చుకోవాలంటే..?
Rs.2000 Notes Exchange
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 02, 2023 | 8:09 AM

Rs.2000 Notes Exchange: పింక్ నోటుల మార్పిడికి గడువు తేదీ దగ్గరపడుతోంది. అయితే ఆంధ్రా, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ఈ విషయం తెలియని వారు ఇంకా చాలా మందే ఉన్నారు. అయితే వారందరూ ఇకనైనా త్వరపడాలి. ఎందుకుంటే రూ. 2 వేల నోట్ల మార్పిడికి గడువు ఈ నెల 30 అంటే సెప్టెంబర్ 30న ముగుస్తోంది. ఈ క్రమంలో ఇంకా రూ. 2 వేల నోట్లను మార్చుకోనివారు వెంటనే మీ సమీప బ్యాంకులకు వెళ్లి మార్చుకోండి. లేదంటే తర్వాత చింతించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెలలో ఏకంగా 16 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. మరోవైపు నోట్ల మార్పిడి గడువు తేదీని పెంచేది లేదని కేంద్రం ఖరాఖండీగా చెప్పేసింది. ఈ క్రమంలో మీరు రూ. 2000 నోట్లను మార్చుకోవడం లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ కోసం బ్యాంక్ ఖాతా తప్పనిసరి, కానీ మార్చుకోవాలనుకుంటే ఎలాంటి ఆకౌంట్ లేదా ఐడీ కార్డు లేకుండానే పని పూర్తి చేసుకోవచ్చు.

అయితే ఒకే సారి గరిష్ఠంగా రూ. 20000 వేల వరకు మాత్రమే రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉంది. అలా కాదు, డిపాజిట్ చేసుకోవాలనుకుంటే మీరు ఎంత మొత్తంలో అయినా జమ చేసుకోవచ్చు. కాగా, సెప్టెంబర్ 30 వరకు మాత్రమే రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు తేదీ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19న ఓ ప్రకటన విడుదల చేసింది. కాబట్టి రూ. 2 వేల నోట్లను మార్చుకోవాలనుకునేవారికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అందులోనూ బ్యాంకులకు 16 సెలవులు ఉన్న నేపథ్యంలో ఎంత తొందరగా పింక్ నోట్లను మార్చుకుంటే అంత మంచిది.

ఇవి కూడా చదవండి

2023 సెప్టెంబర్‌ నెలలో బ్యాంకుల సెలవు రోజులు:

  • 3 సెప్టెంబర్ 2023- ఆదివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • 6 సెప్టెంబర్ 2023- శ్రీ కృష్ణ జన్మాష్టమి కావడంతో భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పట్నాలో సహా పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు
  •  7 సెప్టెంబర్ 2023- శ్రీ కృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో అహ్మదాబాద్, చండీగఢ్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, రాయ్‌పుర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా,తెలంగాణ, జైపూర్, జమ్ము, కాన్పూర్, లఖ్‌నవూ, శ్రీనగర్‌ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
  •  9 సెప్టెంబర్ 2023- రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • 10 సెప్టెంబర్ 2023- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • 17 సెప్టెంబర్ 2023- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • 18 సెప్టెంబర్ 2023- వినాయక చవితి నేపథ్యంలో తెలంగాణ, బెంగళూరులోని బ్యాంకులకు సెలవు
  • 19 సెప్టెంబర్2023- గణేష్ చతుర్థి కావడంతో అహ్మదాబాద్, బేలాపూర్, భువనేశ్వర్, ముంబై, నాగ్‌పూర్, పనాజీలలో బ్యాంకులకు సెలవు
  • 20 సెప్టెంబర్ 2023- గణేష్ చతుర్థి పండుగ కారణంగా కొచ్చి, భువనేశ్వర్‌లో బ్యాంకులకు సెలవు
  • 22 సెప్టెంబర్ 2023- శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కోచి, పనాజీ, త్రివేండ్రంలో బ్యాంకులకు సెలవు
  • 23 సెప్టెంబర్2023 – నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • 24 సెప్టెంబర్ 2023- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • 25 సెప్టెంబర్ 2023- శ్రీమంత్ శంకర్‌దేవ్ జన్మదినం కావడంతో గువాహటిలో బ్యాంకులకు సెలవు
  •  27 సెప్టెంబర్ 2023- మిలాద్-ఎ-షరీఫ్ కారణంగా జమ్ము, కోచి, శ్రీనగర్, త్రివేండ్రంలో బ్యాంకులను సెలవు
  • 28 సెప్టెంబర్ 2023- ఈద్-ఇ-మిలాద్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది
  • 29 సెప్టెంబర్ 2023- ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ కావడంతో గాంగ్‌టక్, జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..