IND vs PAK: క్రికెట్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. భారత్-పాక్ పోరుకు వర్షం ముప్పు.. నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కి కూడా.. వివరాలివే..
భారత్-పాక్ మ్యాచ్ జరిగే సెప్టెంబర్ 2న క్యాండీలో వర్షం పడేందుకు ఏకంగా 93 శాతం అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ 2న జరిగే ఈ ఒక్క మ్యాచ్‌కి మాత్రమే కాదు..క్యాండీలో రేపు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే టోర్నీలోని రెండో మ్యాచ్)కి, ఆపై సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు..
Asia Cup 2023: ఆసియా కప్ టోర్నీ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేరుకుంది. తొలుత లంక రాజధాని కొలంబోకి చేరిన టీమిండియా అక్కడి నుంచి, సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ వేదిక అయిన క్యాండీకి చేరుకుంటారు. ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ని పాకిస్తాన్‌పైనే ఆడనుండడంతో క్రికెట్ ప్రపంచమంతా భారీ అంచనాలతో ఉన్నారు. అయితే వారందరికీ నిరాశ కలిగించే పరిస్థితులు లంకలోని క్యాండీలో నెలకొన్నాయి. అవును, Weather.com ప్రకారం సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా జరిగే భారత్-పాక్ మ్యాచ్ వర్షం ముప్పు ఉంది. ఈ మ్యాచ్ సమయంలో వర్షం పడేందుకు ఏకంగా 93 శాతం అవకాశం ఉందని ఆ వెబ్‌సైట్‌తో పాటు అనేక వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.
క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ 2న జరిగే ఈ ఒక్క మ్యాచ్‌కి మాత్రమే కాదు..క్యాండీలో రేపు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే టోర్నీలోని రెండో మ్యాచ్(86 శాతం అవకాశం)కి, ఆపై సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్(76 శాతం అవకాశం)కి కూడా వర్షం ముప్పు ఉంది.
రోహిత్ సేన..
Here’s the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
పాకిస్తాన్ స్క్వాడ్..
Here’s a look at the Pakistan squad for the Men’s ODI #AsiaCup2023! 🇵🇰
Babar Azam will lead the team with Shadab as his deputy. Rizwan and Haris are the wicketkeepers and the pace battery will be spearheaded by Shaheen Shah Afridi!
Can they combine well and clinch the title? 🤩 pic.twitter.com/1RUWZy3Ilk
— AsianCricketCouncil (@ACCMedia1) August 10, 2023
ఆసియా కప్ పూర్తి షెడ్యూల్..
Get ready for the ultimate clash as 6 top Asian teams fight for supremacy in the Men’s ODI Asia Cup! Exciting matches await in Pakistan (2:30 PM Pak time) and Sri Lanka (3:00 PM SL local time). Let the battle begin! 🏆 #ACC pic.twitter.com/kh9YJM8phK
— AsianCricketCouncil (@ACCMedia1) August 22, 2023